Gali Janardhan Reddy: నేను అనుకుంటే ఒక్క రోజైనా సీఎంను అవుతా..

నాకు ఎమ్మెల్యే, మంత్రి కావాలని ఆశ లేదు.. నేను అనుకుంటే ఒక్క రోజైనా సీఎం కాగలను అంటూ మాజీ మంత్రి, బీజేపీ నేత గాలి జనార్ధన్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆయన సోదరుడు గాలి సోమశేఖరరెడ్డి 57వ బర్త్ డే వేడుకలు మంగళవారం రాత్రి బళ్లారిలోని క్లాసిక్ ఫంక్షన్ హాల్ లో జరిగాయి. ఈ వేడుకల్లో జనార్ధన్ రెడ్డి పాల్గొన్నారు. అభిమానులు, కార్యకర్తలను ఉద్దేశించి జనార్ధన్ రెడ్డి మాట్లాడారు.

Gali Janardhan Reddy: నేను అనుకుంటే ఒక్క రోజైనా సీఎంను అవుతా..

Galli Ganardhan Reddy

Updated On : June 23, 2022 / 7:59 AM IST

Gali Janardhan Reddy: నాకు ఎమ్మెల్యే, మంత్రి కావాలని ఆశ లేదు.. నేను అనుకుంటే ఒక్క రోజైనా సీఎం కాగలను అంటూ మాజీ మంత్రి, బీజేపీ నేత గాలి జనార్ధన్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆయన సోదరుడు గాలి సోమశేఖరరెడ్డి 57వ బర్త్ డే వేడుకలు మంగళవారం రాత్రి బళ్లారిలోని క్లాసిక్ ఫంక్షన్ హాల్ లో జరిగాయి. ఈ వేడుకల్లో జనార్ధన్ రెడ్డి పాల్గొన్నారు. అభిమానులు, కార్యకర్తలను ఉద్దేశించి జనార్ధన్ రెడ్డి మాట్లాడారు. ఈ క్రమంలో నేను అనుకుంటే ఒక్కరోజైనా సీఎంను కాగలను అంటూ వ్యాఖ్యానించారు. వెంటనే కార్యకర్తలు ఆయనపై పూల వర్షం కురిపించారు. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

Atmakur Bypoll: నేడు ఆత్మకూరు ఉపఎన్నిక.. బరిలో ఎంత మంది అంటే..

నాకు ఇబ్బందులు సృష్టించాలని కొందరు ఆదేశాలు చేసినట్లు సీబీ‌ఐ అధికారులే చెప్పారని జనార్ధన్ రెడ్డి వెల్లడించారు. రెడ్డి బ్రదర్స్ కు, శ్రీరాములకు డబ్బుపై ఆశలేదు. నాకు ఎమ్మెల్యే, మంత్రి కావాలని ఆశ లేదని అన్నారు. గాలి జనార్ధన్ రెడ్డి కర్ణాటకలో భారతీయ జనతా పార్టీకి చెందిన నేత. కర్ణాటకలో అత్యంత ధనవంతులైన రాజకీయ నాయకులలో ఒకరు. బళ్లారి జిల్లా బిజెపి అద్యక్షుడుగా పనిచేశాడు. 2006 లో శాసన మండలి సభ్యునిగా ఎన్నికయ్యారు. బి.ఎస్. యడ్యూరప్ప మంత్రివర్గంలో పర్యాటకం కేబినెట్ మంత్రిగా బాధ్యతలు నిర్వహించారు. బళ్లారి, ఓబుళాపురం అక్రమ మైనింగ్ కుంభకోణంలో జైలుకు వెళ్లాడు. గాలి జనార్ధన్ రెడ్డి పేరు తెలుగు రాష్ట్రాల్లోని ప్రజలకు సుపరిచితమే.