ఇక 24×7 ఎప్పుడైనా కరోనా వ్యాక్సిన్ తీసుకోవచ్చు

ఇక 24×7 ఎప్పుడైనా కరోనా వ్యాక్సిన్ తీసుకోవచ్చు

Updated On : March 3, 2021 / 4:09 PM IST

Can Get Vaccinated 24×7 క‌రోనా వ్యాక్సినేష‌న్ ప్ర‌క్రియ‌ను వేగవంతం చేసే దిశ‌గా కేంద్ర ప్ర‌భుత్వం కీల‌క నిర్ణ‌యం తీసుకుంది. ఇందులో భాగంగా వ్యాక్సిన్ పంపిణీ సమయంపై ఉన్న ఆంక్షలను తొలగించింది. ప్రజలు వారికి అనువైన సమయంలో 24×7 ఎప్పుడైనా వ్యాక్సిన్ తీసుకోవచ్చని బుధవారం(మార్చి-3,2021) కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి హర్షవర్ధన్​ తెలిపారు. ఈ స‌మ‌యం అనేది ప్ర‌భుత్వ‌, ప్రైవేటు ఆసుప‌త్రులు రెండింటికీ వ‌ర్తించ‌నుంది. ప్రజల ఆరోగ్యంతో పాటు సమయానికి ఉన్న విలువను ప్రధాని నరేంద్ర మోడీ అర్థం చేసుకుని ఈ నిర్ణయం తీసుకున్నారని హ‌ర్ష‌వ‌ర్ధ‌న్ ట్వీట్​ చేశారు.

కాగా, మంగళవారం రాష్ట్రాల ఆరోగ్య శాఖ అధికారులు, ప్రైవేటు ఆసుపత్రులతో సమావేశంలో కేంద్ర ఆరోగ్య శాఖ కార్యదర్శి రాజేశ్​ భూషణ్​. ఇదే విషయం చెప్పారు. వ్యాక్సిన్​ పంపిణీ సమయం ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకే అనేది తొలగించినట్లు చెప్పారు. ఆ తర్వాత కూడా వ్యాక్సినేషన్​ చేసేందుకు సామర్థ్యం కలిగిన ఆసుపత్రులకు అనుమతులు ఇచ్చినట్లు తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వాలను సంప్రదించి టీకా పంపిణీ చేయొచ్చని వివరించారు. వ్యాక్సినేష‌న్ సెంట‌ర్ల ద‌గ్గ‌ర ప్ర‌జ‌లు గుమిగూడ‌కుండా కూడా ఈ నిర్ణ‌యం ఉప‌క‌రిస్తుంది

ఇక, వ్యాక్సిన్ తొలి డోసు తీసుకున్న వారికి ఫిబ్రవరి 13 నుంచి కొవిడ్​-19 వ్యాక్సిన్ రెండో డోసు ఇస్తున్నారు. మార్చి 1 నుంచి దేశంలో వ్యాక్సినేషన్​ రెండో దశను ప్రారంభించారు. 60 ఏళ్లకు పైబడిన వారికి, 45 ఏళ్లు అంతకన్నా ఎక్కువ ఉండి ఇతర అనారోగ్య లక్షణాలు ఉన్నవారికి వ్యాక్సిన్​ ఇస్తున్నారు. దేశవ్యాప్తంగా ఇప్పటి వరకు మొత్తంగా 1.56 కోట్ల డోసులు ఇచ్చారు. ప్రధాని మోడీ,రాష్ట్రపతి కోవింద్,ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు సహా పలువురు కేంద్రమంత్రులు,ఎంపీలు,పలు రాష్ట్రాల సీఎంలు రెండో దశలో వ్యాక్సిన్ తీసుకున్నవారిలో ఉన్నారు.