కంచే చేను మేస్తే: బాలికను లైంగికంగా వేధించిన ఎస్పీ

‘కంచే చేను మేస్తే’ అనే చందాన రక్షణ ఇవ్వాల్సిన పోలీసే బాలికపై అత్యాచారానికి ఒడిగట్టారు. అసోం రాష్ట్రంలోని కర్బీఅంగ్‌లాంగ్ పట్టణంలో బాలికపై పోలీసు సూపరింటెండెంట్ (ఎస్పీ) అత్యాచారంకు తెగబడ్డాడు.
కర్బీఅంగ్‌లాంగ్ ఎస్పీగా పనిచేస్తున్న గౌరవ్ ఉపాధ్యాయ్ ఓ మైనర్ బాలికపై లైంగిక దాడికి పాల్పడ్డాడు. బాలిక ఫిర్యాదు మేరకు ఎస్పీ గౌరవ్ ఉపాధ్యాయ్ పై పోస్కో చట్టం సెక్షన్ 10 కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని పోలీసు కమిషనర్ ఎంపీ గుప్తా వెల్లడించారు.
ఈ ఘటనకు సంబంధించి విచారణ జరుగుతున్నట్లుగా కమిషనర్ చెప్పారు.