కరోనా కారణంగా సీబీఎస్‌ఈ పరీక్షలు వాయిదా

కరోనా వైరస్ కారణంగా ఇప్పటికే సినిమా హాళ్లు, స్కూళ్లు, పలు ప్రదేశాలు మూతపడ్డాయి. కరోనా వైరస్‌పై ప్రపంచవ్యాప్తంగా ఆందోళనలు వస్తున్న సమయంలోనే పరీక్షలపై కూడా దీని ప్రభావం పడింది. ఈ క్రమంలోనే సీబీఎస్ఈ (CBSE Exams) పదవ తరగతి, ఇంటర్ పరీక్షలు వాయిదా పడినట్లుగా బోర్డు ప్రకటించింది. ఉన్నత విద్యాశాఖ నుంచి వచ్చిన సలహా మేరకు ఈ మేరకు కీలక నిర్ణయాలు తీసుకుంటున్నట్టుగా సీబీఎస్ఈ బోర్డు ప్రకటనలో వెల్లడించింది.
నేటి(మార్చి 19వ తేదీ) నుంచి మార్చి 31వ తేదీ మధ్య భారతదేశంతో పాటు దేశాల్లో నిర్వహించవలసిన పదో తరగతి, 12వ తరగతి పరీక్షలను వాయిదా వేస్తున్నట్లు ప్రకటించింది. మార్చి 31వ తేదీ తర్వాతే పరీక్షలు ఉండవచ్చునని అధికారులు వెల్లడించారు. అయితే రీ షెడ్యూల్ తేదీలు మార్చి 31వ తేదీకి ముందే ఓ మీటింగ్ పెట్టుకుని అధికారులు ప్రకటించే అవకాశం ఉంది.
ప్రస్తుతం దేశంలోని కొన్ని స్కూళ్లలో జరుగుతున్న పేపర్లు దిద్దే ప్రక్రియను కూడా నిలిపివేశారు. అన్ని కేంద్రాల్లోని నోడల్ ఆఫీసర్లు పేపర్లను జాగ్రత్త చేయాలని, ఏప్రిల్ 1 నుంచి మళ్లీ కరెక్షన్ చేపట్టాలని ఆదేశించింది. ఇప్పటికే కరెక్షన్ చేసిన వాటిని జాగ్రత్త చేయాలని సూచించింది. ఆయా ఆన్సర్ షీట్లకు సీల్ వేసి, సంతకాలు తీసుకోవాలని ఆదేశించింది.
Read Also | పారాసెట్మాల్ మింగేసి తప్పించుకుని పోతున్నారు