రైలు బోగీల్లో సీసీ కెమెరాలు

  • Published By: veegamteam ,Published On : April 30, 2019 / 07:27 AM IST
రైలు బోగీల్లో సీసీ కెమెరాలు

Updated On : April 30, 2019 / 7:27 AM IST

గత కొంతకాలంగా రైళ్లలో దోపిడీలు పెరిగిపోయాయి. వీటికి చెక్  పెట్టేందుకు రైల్వే శాఖ బోగీల్లో సీసీ కెమెరాలు పెట్టాలని నిర్ణయించుకుంది. బోగీల్లో ప్రత్యేక పోలీసు బలగాలతో ప్రయాణికుల భద్రతను పర్యవేక్షిస్తున్న రైల్వేశాఖ తాజాగా కొత్తగా తయారుచేసే కోచ్‌ల్లో సీసీ కెమెరాలను అమర్చేందుకు సిద్ధమైనట్లు తెలుస్తోంది. 

రైలు బోగీలు, ఇంజన్ల తయారీలో భాగంగా రైల్వే బోర్డు రోలింగ్‌ స్టాక్‌ విభాగం త్వరలో కొత్త కోచ్‌లలో సీసీ కెమెరాలను అమర్చేందుకు సిద్ధమైంది. 2018-19ల్లో 6వేల కోచ్‌లను తయారు చేసి సరికొత్త రికార్డు సాధించింది. సాధారణ ప్రయాణీకుల కోసం  బెర్తులు, సీట్లు, ఫ్యాన్లు, తదితర సౌకర్యాలతో పాటు కొత్తగా తయారు చేసే బోగీల్లో సీసీ కెమెరాలను అమర్చనుంది. 

రోలింగ్‌ స్టాక్‌ ఆధ్వర్యంలో కొత్తగా తయారు చేసే రైలు బోగీల్లో ఇన్‌బిల్ట్‌గా సీసీ కెమెరాలను అమర్చడంతో దొంగలను సులువుగా పట్టుకునే అవకాశం ఉంటుంది. బోగీల్లోకి ఎక్కిన వారిలో అనుమానితులు ఎవరున్నారు.. మహిళలపై పట్ల వారి ప్రవర్తన ఎలా ఉంది? దొంగతనం చేయటం..తరువాత వారు ఎలా ఎస్కేప్ అవుతున్నారు? వంటి పలు అంశాలు సీసీ నిఘా ద్వారా తెలుసుకోవచ్చు.

అంతేకాదు కొంతమంది ఆకతాయిలు మహిళలు, యువతుల పట్ల అసభ్యకరంగా ప్రవర్తిస్తున్న తీరు పసిగట్టవచ్చు. ఆర్‌పీఎఫ్‌ పోలీసులు వారి చిత్రాలను రైల్వేస్టేషన్లలో ప్రదర్శిస్తూ ఆకతాయులపై అప్రమత్తంగా ఉండాలని ప్రయాణికులకు తెలియజేయవచ్చు. 
 
దక్షిణ మధ్య రైల్వేకు సికింద్రాబాద్‌ స్టేషన్‌ నుంచి ప్రతిరోజూ 100కు పైగా ఎక్స్‌ప్రెస్‌, పలు పాసింజర్‌ రైళ్ల ద్వారా 1.50 లక్షల మంది ప్రయాణిస్తుంటారు. పలు పండుగల సందర్భంలో ఈ సంఖ్య భారీగా పెరుగుతుంది. ఇటువంటి సమయంలో దొంగలు చేతివాటం  ప్రదర్శిస్తు..అందినకాడికి దోచుకుటుంటారు. ఈ క్రమంలో రైలు కోచ్‌ల్లో ఇన్‌బిల్ట్‌గా సీసీ కెమెరాలను ఏర్పాటు చేయడం ద్వారా దొంగతనాలకు..దోపిడీలకు చెక్ పెట్టవచ్చని ఇటు ప్రయాణీకులు..అభిప్రాయాలను వ్యక్తంచేస్తున్నారు. వీటిని పరిగణలోకి తీసుకున్న రైల్వే శాఖ కొత్తగా తయారు చేసే బోగీలకు సీసీ కెమెరాలను అమర్చాలను యోచిస్తోంది. రైళ్లలో సీసీ కెమెరాలను ఏర్పాటు చేయడం వల్ల చోరీలను కట్టడి చేయవచ్చని అధికారులు భావిస్తున్నారు.