Actor Tina Datta : ఈ దీపావళి పెంపుడు కుక్క బ్రూనోతో జరుపుకున్నా…సినీనటి టీనాదత్తా
ప్రముఖ సినీనటి టీనాదత్తా ఈ సారి దీపావళి వేడుకలు తన పెంపుడు కుక్క బ్రూనోతో జరుపుకున్న ఉదంతం తాజాగా వెలుగుచూసింది. తన కుటుంబానికి దూరంగా కోల్‌కతాలో ఉన్న టీనాదత్తా తన పెంపుడు శునకమైన బ్రూనోతో జరుపుకోవడం విశేషం.....

Actor Tina Datta
Actor Tina Datta : ప్రముఖ సినీనటి టీనాదత్తా ఈ సారి దీపావళి వేడుకలు తన పెంపుడు కుక్క బ్రూనోతో జరుపుకున్న ఉదంతం తాజాగా వెలుగుచూసింది. తన కుటుంబానికి దూరంగా కోల్‌కతాలో ఉన్న టీనాదత్తా తన పెంపుడు శునకమైన బ్రూనోతో జరుపుకోవడం విశేషం. ‘‘బ్రూనో నా బిడ్డలాంటిది. పెంపుడు జంతువులు తన అభిప్రాయాలను వ్యక్తపర్చలేవు, పదేళ్లపాటు జీవించే ఈ శునకాలు మన జీవితంలోకి వస్తాయి, అందుకే దీపావళి సందర్భంగా బ్రూనోతో గడిపాను’’ అని టీనా చెప్పారు.
ALSO READ : Cricket World Cup 2023: సెమీఫైనల్ మ్యాచ్‌కు ముందు బెంగళూరులో టీం ఇండియా దీపావళి వేడుకలు
తనకు దీపావళి అంటే ఎంతో ఇష్టమని, దీంతోపాటు తాను క్రిస్మస్ కూడా జరుపుకుంటానని చెప్పారు. ఖాళీ సమయంలో తాను ఇంటిని అలంకరించుకోవడానికి సమయాన్ని వెచ్చిస్తానని చెప్పారు. టీనాదత్తా తన బాల్యంలో జరుపుకున్న దీపావళిని గుర్తు చేసుకున్నారు. ‘‘నేను కోల్‌కతాకు తిరిగి వచ్చినప్పుడు మాకు చాలా క్రాకర్లు వచ్చేవి, మేం నలుగురు అన్నదమ్ములు, సోదరీమణులం, కానీ పర్యావరణం పరిరక్షణ కోసం మేం వాటిని కాల్చడం మానేశాం’’ అని ఆమె చెప్పారు.
ALSO READ : Manish Sisodia : భార్యను కౌగిలించుకున్న మనీష్ సిసోడియా…చిత్రాన్ని పంచుకున్న సీఎం కేజ్రీవాల్
‘‘నా బ్రూనో చుట్టుపక్కల ఉన్న బాణసంచా పేలుడు శబ్దాలకు భయపడటం కూడా నేను చూస్తున్నాను, కాబట్టి నేను బ్రూనోతో కూర్చున్నాను. నా స్నేహితుల్లో ఒకరు తన పెంపుడు కుక్కతో కలిసి ప్రత్యేకంగా బెంగళూరు వెళ్లారు. ఈ సారి తాను దీపావళి నా బ్రూనోతోనే జరుపుకుంటున్నాను’’ అని టీనాదత్తా వివరించింది.