కొనసాగుతున్న పోలింగ్ : ఓటేసిన ప్రముఖులు

  • Published By: madhu ,Published On : October 21, 2019 / 04:24 AM IST
కొనసాగుతున్న పోలింగ్ : ఓటేసిన ప్రముఖులు

Updated On : October 21, 2019 / 4:24 AM IST

మహారాష్ట్ర, హర్యానా, హుజూర్ నగర్ అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ కొనసాగుతోంది. 2019, అక్టోబర్ 21వ తేదీ సోమవారం ఉదయం 7గంటలకు పోలింగ్ ప్రారంభమైంది. దేశ వ్యాప్తంగా 52 స్థానాల్లో ఉప ఎన్నికల పోలింగ్ ప్రశాంతంగా జరుగుతోంది. ఓటు వేసేందుకు ఓటర్లు క్యూ లైన్లలో నిలబడి ఉన్నారు. పలువరు ప్రముఖులు సైతం ఓటు హక్కును వినియోగించుకున్నారు.

కేంద్ర మంత్రి నితిన్ గడ్కరి, ఒలింపిక్ పతక విజేత, బరోడా బీజేపీ అభ్యర్థి యోగేశ్వర్ దత్, హర్యాణా కాంగ్రెస్ చీఫ్ కుమారి సెల్జా, ఎన్సీపీ నేత సుప్రియా మాలే, ఎన్సీపీ సీనియర్ నేత అజిత్ పవార్, ప్రముఖ క్రీడాకారిణి బబితా ఫోగట్ ఆయా పోలింగ్ కేంద్రాలకు వచ్చి ఓటు వేశారు. ఆర్ఎస్ఎస్ సంఘ్ నేత చాలక్ మోహన్ భగవత్ నాగ్ పూర్ సెంట్రల్ నియోజకవర్గ పరిధిలో ఓటు హక్కు వినియోగించుకున్నారు. ఈ సందర్భంగా ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ సందేశం ఇచ్చారు. ప్రజలు రికార్డు స్థాయిలో ఓటింగ్‌లో పాల్గొనాలని పిలుపునిచ్చారు. 

ఇదిలా ఉంటే…ఉదయం 9 గంటల వరకు మహారాష్ట్రలో 1.8 శాతం, హర్యానాలో 4.17 శాతం పోలింగ్ నమోదైంది. ఈ రెండు రాష్ట్రాల్లో సాయంత్రం 6గంటల వరకు పోలింగ్ జరుగనుంది. తెలంగాణ రాష్ట్రంలోని హుజూర్ నగర్ ఉప ఎన్నిక ప్రశాంతంగా పోలింగ్ ప్రారంభమైంది. ఉదయం 9 గంటల వరకు 13.44 శాతం పోలింగ్ నమోదైంది. 
Read More : ఓటరు చేతిలో : మహారాష్ట్ర, హర్యానాలో ఎన్నికల పోలింగ్ ప్రారంభం

> మహారాష్ట్రలో 288 స్థానాలకు ఎన్నిక జరుగుతోంది. 3 వేల 237 మంది బరిలో ఉన్నారు. 
> హర్యానాలో 90 స్థానాలకు ఎన్నిక జరుగుతోంది. 1, 169 మంది పోటీ చేస్తున్నారు. 
> వీటితో పాటు మరో 16 రాష్ట్రాలు, ఒక కేంద్ర పాలిత ప్రాంతంలోని 51 అసెంబ్లీ నియోజకవర్గాలకు, రెండు లోక్ సభ స్థానాలకు కూడా సోమవారం ఉప ఎన్నికలు జరుగుతున్నాయి.