కేంద్రం సంచలన నిర్ణయం..onion ఎగుమతులు బంద్

  • Published By: madhu ,Published On : September 15, 2020 / 10:29 AM IST
కేంద్రం సంచలన నిర్ణయం..onion ఎగుమతులు బంద్

Updated On : September 15, 2020 / 11:07 AM IST

Govt bans : ఉల్లి పాయల ఎగుమతులపై కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఉల్లి ఎగుమతులపై నిషేధం విధించింది. తక్షణమే ఈ నిషేధం అమల్లోకి వస్తుందని విదేశీ వాణిజ్య డైరెక్టర్‌ జనరల్‌ నోటిఫికేషన్‌ విడుదల చేసింది. దేశంలో ఉల్లిపాయల లభ్యతను పెంచడమే లక్ష్యంగా ఈ చర్యలు తీసుకున్నట్టు ప్రభుత్వం తెలిపింది.




తాము చెప్పేంత వరకు ఉల్లి ఎగుమతులు నిలిపివేయాలని ఆ ఉత్తర్వుల్లో కేంద్రం స్పష్టం చేసింది. ఉల్లి ఎక్కువగా దక్షిణాది రాష్ట్రాల్లోనే ఉత్పత్తి అవుతోంది. అయితే ఇటీవల కురిసిన వర్షాలతో వేలాది ఎకరాల్లో ఉల్లిపంట దెబ్బతింది. మిగతా రాష్ట్రాల్లో కోత ఆలస్యంకానుంది. ఉల్లి సరఫరా పడిపోవడంతో దేశంలో ఉల్లిపాయల కొరత ఏర్పడింది.
https://10tv.in/recovered-from-the-corona-central-govt-new-guidelines/
మరోవైపు ఉల్లిపాయల ధరలు రోజురోజుకు పెరుగుతున్నాయి. సామాన్యులను కన్నీళ్లు పెట్టించే పరిస్థితి ఏర్పడింది. ఈ నేపథ్యంలోనే కేంద్ర ప్రభుత్వం అప్రమత్తమైంది. దిద్దుబాటు చర్యలకు ఉపక్రమించింది. ఉల్లి ఎగుమతులపై నిషేధం విధిస్తూ నిర్ణయం తీసుకుంది.




దక్షిణాసియా దేశాల వంటకాల్లో ప్రధానంగావాడే ఉల్లిపాయల ఎగుమతిదారుల్లో భారత్‌ ప్రధానమైనది. బంగ్లాదేశ్‌, నేపాల్‌, మలేషియా, శ్రీలంకతోపాటు ఇతర దేశాలు ఉల్లికోసం భారత్‌పైనే ఆధారపడతాయి. దేశంలోనే అతిపెద్ద ఉల్లిపాయల వాణిజ్య కేంద్రమైన లాసల్‌గావ్‌లో నెల వ్యవధిలోనే టన్ను ఉల్లిధరలు మూడు రెట్లు పెరిగాయి.

ప్రస్తుతం ఈ మార్కెట్‌లో టన్ను ధర 30 వేలు పలుకుతోంది. దేశ రాజధాని నగరంలో ప్రస్తుతం కిలో ఉల్లి ధర 40రూపాయలకు పెరిగింది. రోజురోజుకు ఉల్లి ధరలు పెరుగుతుండడం, రాబోయే రోజుల్లో కొరత ఏర్పడే అవకాశముందని గుర్తించిన కేంద్రం….. ఇతర దేశాలకు ఎగుమతులను రద్దు చేసింది.