COVID-19 ఎమర్జెన్సీ రెస్ఫాన్స్ ప్యాకేజీ…రాష్ట్రాలకు 1500కోట్లు కేటాయింపు

  • Published By: venkaiahnaidu ,Published On : April 9, 2020 / 01:06 PM IST
COVID-19 ఎమర్జెన్సీ రెస్ఫాన్స్ ప్యాకేజీ…రాష్ట్రాలకు 1500కోట్లు కేటాయింపు

Updated On : April 9, 2020 / 1:06 PM IST

కరోనాపై పోరుకు కేంద్రం ప్రత్యేక ప్యాకేజీని విడుదల చేసింది. రాష్ర్టాలకు రూ. 15 వేల కోట్లతో అత్యవసర ప్యాకేజీని విడుదల చేస్తూ కేంద్రం ఉత్తర్వులు జారీ చేసింది. కరోనా వ్యాప్తిని నిరోధించేందుకుపోరాడుతున్న జాతీయ, రాష్ట్ర స్థాయి ఆరోగ్య వ్యవస్థలను బలోపేతం చేసేందుకు రూ. 15 వేల కోట్ల నిధులను భారత ప్రభుత్వం కేటాయించింది. ఈ నిధులకు కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ ఆమోదం తెలిపింది.

రూ. 15 వేల కోట్ల కోవిడ్-19 ఎమర్జెన్సీ రెస్ఫాన్స్ అండ్ హెల్త్ సిస్టమ్ ప్రిపేర్డ్ నెస్ ప్యాకేజీ నిధులను మూడు దశల్లో ఖర్చు పెట్టనున్నారు. జనవరి 2020 నుంచి జూన్‌ 2020 వరకు మొదటి దశ, జులై 2020 నుంచి మార్చి 2021 వరకు రెండో దశ, ఏప్రిల్‌ 2021 నుంచి మార్చి 2024 వరకు మూడో దశగా కేంద్రం నిర్ణయించింది. రాష్ట్రాలతో కలిపి కరోనాపై పోరుకు కేంద్రం ఈ నిధులను ఖర్చుచేయనుంది.

ఇక, తెలంగాణతో పాటు 9 రాష్ర్టాలకు ప్రత్యేక బృందాలను కేటాయించింది. కరోనాపై రాష్ట్ర అధికారులతో కలిసి కేంద్ర బృందాలు పని చేయనున్నాయి. తెలంగాణ, తమిళనాడు, మహారాష్ట్ర, బీహార్‌, మధ్యప్రదేశ్‌, గుజరాత్‌, ఉత్తరప్రదేశ్‌, కర్ణాటక, రాజస్థాన్‌కు ప్రత్యేక బృందాలను కేటాయించారు. మరోవైపు 1.7కోట్ల పీపీఈ కిట్లు,49వేల వెంటిలేటర్లకు కేంద్ర ఆర్డర్ ఇచ్చినట్లు కేంద్రఆరోగ్యశాఖ సంయుక్త కార్యదర్శి లవ్ అగర్వాల్ తెలిపారు.