Cognyte Spyware: అప్పుడు పెగాసస్, ఇప్పుడు కాగ్నైట్.. సొంత మంత్రుల మీదే నిఘా అంటూ కేంద్ర ప్రభుత్వంపై కాంగ్రెస్ సంచలన ఆరోపణలు
అబద్ధాల రాజభవనం కూలిపోతుందని చక్రవర్తి భయపడుతున్నారంటూ పరోక్షంగా ప్రధానమంత్రి నరేంద్రమోదీని ఉద్దేశించి వ్యాఖ్యానించారు. అందుకే ప్రతిపక్షాలు, జర్నలిస్టులు, న్యాయవ్యవస్థ, పౌరులతోపాటు సొంత మంత్రులపై కూడా గూఢచర్యం చేయడానికి ప్రభుత్వం కొత్త సాంకేతికతను ఉపయోగిస్తుందని ఆరోపించారు

Pawan Khera
Cognyte Spyware: కొద్ది రోజుల క్రితం పెగాసస్ వివాదం దేశాన్ని కుదిపివేసింది. ఇజ్రాయెల్ నుంచి దిగుమతి చేసుకున్న ఈ సాఫ్ట్‌వేర్ ద్వారా అనేక మంది ఫోన్లలోకి కేంద్ర ప్రభుత్వం అక్రమంగా చొరబడిందనే ఆరోపణలు పెద్ద ఎత్తున వచ్చాయి. కాగా, తాజాగా రూ.986 కోట్లతో పెగాసస్ మాదిరి ‘కాగ్నైట్’ (Cognyte) స్పైవేర్‌ను కొనేందుకు కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం ప్రయత్నిస్తున్నదని కాంగ్రెస్ పార్టీ ఆరోపించింది. ప్రతిపక్ష నేతలు, మీడియా, స్వచ్ఛంద సంస్థలపై నిఘా పెట్టేందుకు ఈ గూఢచర్య సాఫ్ట్‌వేర్‌ను ఉపయోగిస్తారని ఆ పార్టీ అధికార ప్రతినిధి పవన్ ఖేరా ఆరోపించారు.
Asaduddin Owaisi: కాంగ్రెస్, బీజేపీ ఒకే నాణానికి ఉన్న రెండు ముఖాలు.. ఓవైసీ విమర్శలు
సోమవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ పెగాసస్ స్పైవేర్ గురించి అందరికీ తెలిసిపోవడంతో ‘కనీస పాలన-గరిష్ట నిఘా’ ఉన్న ప్రభుత్వం మార్కెట్లో ఉన్న కొత్త స్పైవేర్ ‘కాగ్నైట్’ కోసం చూస్తున్నదని విమర్శలు గుప్పించారు. ‘ ప్రభుత్వం కేవలం ప్రతిపక్షాలను మాత్రమే ద్వేషిస్తుందని తాను భావించానని, అయితే తమ మంత్రులపై కూడా గూఢచర్యం సాఫ్ట్‌వేర్‌ను వారు ఉపయోగించారని అని ఆయన ఆరోపించారు. అయితే దేశంలోని ఇద్దరు గూఢచారులు చట్టాన్ని, మీడియాతో సహా ఎవరినీ నమ్మరని పవన్ ఖేరా విమర్శించారు. అందుకే స్పై సాఫ్ట్‌వేర్, ఇజ్రాయెల్ టెక్నాలజీని కొనుగోలు చేసేందుకు పన్ను చెల్లింపుదారుల కోట్లాది డబ్బును ఖర్చు చేస్తున్నారని తీవ్ర స్థాయిలో మండిపడ్డారు.
Mayawati: నేరస్తులకు టికెట్ ఇచ్చేది లేదని తేల్చి చెప్పిన బీఎస్పీ చీఫ్ మాయావతి
తన అబద్ధాల రాజభవనం కూలిపోతుందని చక్రవర్తి భయపడుతున్నారంటూ పరోక్షంగా ప్రధానమంత్రి నరేంద్రమోదీని ఉద్దేశించి వ్యాఖ్యానించారు. అందుకే ప్రతిపక్షాలు, జర్నలిస్టులు, న్యాయవ్యవస్థ, పౌరులతోపాటు సొంత మంత్రులపై కూడా గూఢచర్యం చేయడానికి ప్రభుత్వం కొత్త సాంకేతికతను ఉపయోగిస్తుందని ఆరోపించారు. అలాగే ‘కాగ్నైట్’ సాఫ్ట్‌వేర్‌ను కొనుగోలు చేయడానికి ఏ మంత్రిత్వ శాఖకు టాస్క్ ఇచ్చారు? దాని కోసం ఎంత ఖర్చు చేస్తున్నారు? అని పవన్ ఖేరా ప్రశ్నించారు.