మోదీ సర్కారు సంచలన నిర్ణయం.. సీఏఏ అమలుకు నోటిఫికేషన్ జారీ

 పొరుగు దేశాల్లో అణచివేతకు గురైన మైనారిటీ వర్గాలకు పౌరసత్వం ఇచ్చేందుకు సీఏఏ వెసులుబాటు ఇస్తుంది. 

మోదీ సర్కారు సంచలన నిర్ణయం.. సీఏఏ అమలుకు నోటిఫికేషన్ జారీ

CAA

ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ సర్కారు కీలక నిర్ణయం తీసుకుంది. సిటిజన్‌షిప్ అమెండ్‌మెంట్ యాక్ట్ అమలుకు నోటిఫికేషన్ జారీ చేసింది. 2019 ఎన్నికల వేళ బీజేపీ తమ మ్యానిఫెస్టోలో సీఏఏను చేర్చింది. పొరుగు దేశాల్లో అణచివేతకు గురైన మైనారిటీ వర్గాలకు పౌరసత్వం ఇచ్చేందుకు సీఏఏ వెసులుబాటు ఇస్తుంది.

పాకిస్థాన్, ఆఫ్గానిస్థాన్, బంగ్లాదేశ్ నుంచి వచ్చిన ముస్లిమేతర శరణార్థులకు సీఏఏ వరంగా మారనుంది. 2019 డిసెంబర్ 11న పార్లమెంట్ లో సీఏఏ ఆమోదం పొందింది. మొదటిసారి మత ప్రాతిపదికన పౌరసత్వ కల్పన జరుగుతుంది. 2019లో సీఏఏకు సంబంధించి హింసాత్మక ఘటనల్లో 100 మందికి పైగా మృతి చెందారు. లోక్ సభకు ఎన్నికలు సమీపిస్తున్న వేళ కేంద్రం కీలక అడుగు వేసిందని చెప్పుకోవాలి.  నాలుగేళ్లుగా సీఏఏ అమలు వాయిదా పడుతూ వస్తోంది.

ఎప్పుడు ఏం జరిగింది? ఏం జరగనుంది? 

  • పౌరసత్వ సవరణ చట్టం-1955కి 2019లో సవరణ చేసిన కేంద్రం
  • 2016లో పౌరసత్వ సవరణ బిల్లు తీసుకొచ్చిన కేంద్రం
  • 2019లో ఆమోదం పొందిన బిల్లు.. ఇప్పటివరకు నిబంధనలను ప్రకటించని కేంద్రం
  • లోక్ సభ ఎన్నికల ముందే ఈ చట్టం తీసుకొస్తామని చెప్పిన కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా
  • దేశ విభజన జరిగినప్పుడు పొరుగు దేశంలో వేధింపులకు గురవుతున్న మైనారిటీల కోసం కాంగ్రెస్ పార్టీ పౌరసత్వం కల్పిస్తామన్న వాగ్దానం చేసింది.. కానీ అమలు చేయలేదు.. చట్టం తీసుకురాలేదు
  • ఉమ్మడి పౌరసత్వ సవరణ చట్టం వల్ల ఎవరికి ఎటువంటి ఇబ్బందులు ఉండవు
  • 2014 డిసెంబర్ 31 కంటే ముందు పాకిస్థాన్, ఆఫ్గానిస్థాన్, బంగ్లాదేశ్ నుంచి వచ్చిన హిందువులు, క్రైస్తవులు, సిక్కులు, జైనులు బౌద్ధులు, పార్శీలకు వర్తించనున్న సీఏఏ

Bjp Second List : లోక్‌సభ ఎన్నికలు.. బీజేపీ సెకండ్ లిస్ట్ రెడీ..!