Full Salary: కాంట్రాక్ట్ ఉద్యోగులకు ఫుల్ శాలరీ ప్రకటించిన కేంద్రం

దేశ వ్యాప్తంగా వణికిస్తోన్న కరోనా సెకండ్ వేవ్ ఫలితంగా ప్రతి ఒక్కరూ ఏదో విధంగా నష్టపోతూనే ఉన్నారు. రెగ్యూలర్ ఉద్యోగుల మాట అటుంచితే కాంట్రాక్ట్ ఉద్యోగుల ఆర్థిక పరిస్థితి మరింత తక్కువ పడిపోయింది. వీరికి అనుకూలంగా నిర్ణయం తీసుకుంటూ ..

Full Salary: కాంట్రాక్ట్ ఉద్యోగులకు ఫుల్ శాలరీ ప్రకటించిన కేంద్రం

Full Salary

Updated On : June 10, 2021 / 11:28 AM IST

Full Salary: దేశ వ్యాప్తంగా వణికిస్తోన్న కరోనా సెకండ్ వేవ్ ఫలితంగా ప్రతి ఒక్కరూ ఏదో విధంగా నష్టపోతూనే ఉన్నారు. రెగ్యూలర్ ఉద్యోగుల మాట అటుంచితే కాంట్రాక్ట్ ఉద్యోగుల ఆర్థిక పరిస్థితి మరింత తక్కువ పడిపోయింది. వీరికి అనుకూలంగా నిర్ణయం తీసుకుంటూ కేంద్రం గుడ్ న్యూస్ ప్రకటించింది. కాంట్రాక్ట్ ఉద్యోగులకు ఫుల్ శాలరీ ఇవ్వాలని అనౌన్స్ చేసింది.

2021 ఏప్రిల్ 1 నుంచి జూన్ 30వరకూ మొత్తం జీతం ఇవ్వాలని పని దినాలకు మాత్రమే చెల్లించడం సరికాదని స్పష్టం చేసింది. కొవిడ్ 19 కారణంగా విధించిన లాక్ డౌన్ ఈ కాంట్రాక్ట్ వర్కర్లు ఇంటి వద్దనే ఉండిపోయారు.

సెకండ్ వేవ్ కారణంగా ఇంటి వద్దనే ఉండిపోయిన కాంట్రాక్చువల్ ఉద్యోగులను ఆన్ డ్యూటీలో ఉన్న వ్యక్తులుగా పరిగణించాలని చెప్పింది. ఈ మేరకు అన్ని మంత్రిత్వ శాఖలకు పర్మిషన్ ఇస్తూ ప్రకటన ఇష్యూ చేసింది.

రిపోర్ట్ ప్రకారం.. మంగళవారం రాష్ట్ర ప్రభుత్వాలకు లెటర్ పంపింది కేంద్ర ప్రభుత్వం. ఆఫీసర్ల కొరత ఉందని డిప్యూటీ సెక్రటరీ, డైరక్టర్, జాయింట్ సెక్రటరీ పదవుల్లో సెంట్రల్ డిప్యూటేషన్ కోసం నియమకాలు జరపాలని ఆదేశించింది.

ఇండియాలో బుధవారం నమోదైన కరోనా కేసులు 92వేల 596ఉండగా.. మొత్తం ఇన్ఫెక్షన్ల సంఖ్య 2కోట్ల 90లక్షల 89వేల 69కి చేరింది. యాక్టివ్ కేసుల సంఖ్య 12లక్షల 31వేల 415కు పడిపోయింది.