LPG cylinder : అవన్నీ ఊహాగానాలే.. ఆ గ్యాస్ సిలిండర్లపై క్లారిటీ ఇచ్చిన కేంద్ర ప్రభుత్వం
LPG cylinder : పెట్రోలియం మంత్రిత్వ శాఖ సంయుక్త కార్యదర్శి సుజాత శర్మ మాట్లాడుతూ.. 10 కేజీల ఎల్పీజీ సిలిండర్లను అందుబాటులోకి తెస్తున్నామన్న వార్తలు కేవలం ఊహాగానాలేనని , అలాంటి ఆలోచనలేం లేవని స్పష్టం చేశారు.
LPG cylinder
LPG cylinder : గృహ వినియోగ అవసరాలకోసం ప్రస్తుతం 14.2 కేజీల ఎల్పీజీ సిలిండర్లను పంపిణీ చేస్తున్నారు. పశ్చిమాసియాలో ఉద్రిక్తతల నేపథ్యంలో దేశవ్యాప్తంగా ఎల్పీజీ గ్యాస్ కొరత నెలకొంది. ఈ నేపథ్యంలో కేంద్రం కీలక నిర్ణయం తీసుకుందని, గృహ వినియోగదారులకు సరఫరాలో అంతరాయం కలగకుండా ఉండేందుకు 10కేజీల ఎల్పీజీ గ్యాస్‌తో సిలిండర్లను సరఫరా చేయబోతుందని, ఇందుకోసం ఆయిల్ కంపెనీలు కూడా సిద్ధమైనట్లు వార్తలు వచ్చాయి. అయితే, ఈ వార్తలను కేంద్ర ప్రభుత్వం కొట్టిపారేసింది. అలాంటి ఆలోచన ఏమీలేదని స్పష్టం చేసింది.
Also Read : Gold Rate decreased : గంటల వ్యవధిలోనే కుప్పకూలిన బంగారం ధర.. గతంలో ఎప్పుడూ లేనంతగా.. కొత్త ధరలు ఇవే!
పెట్రోలియం మంత్రిత్వ శాఖ సంయుక్త కార్యదర్శి సుజాత శర్మ మాట్లాడుతూ.. 10 కేజీల ఎల్పీజీ సిలిండర్లను అందుబాటులోకి తెస్తున్నామన్న వార్తలు కేవలం ఊహాగానాలేనని , అలాంటి ఆలోచనలేం లేవని స్పష్టం చేశారు. ఎల్పీజీ సిలీండర్ల బరువు తగ్గించే ఆలోచనేదీ లేదని, ప్రస్తుతం 14.2 కేజీల ఎల్పీజీ సిలిండర్లు సరఫరా అవుతున్న విషయం తెలిపారు.
సాధారణంగా గృహావసరాలకు ఉపయోగించే 14.2కేజీల వంట గ్యాస్ సిలిండర్ సగటున 45నుంచి 55 రోజుల వరకు వస్తుంది. ప్రస్తుతం హైదరాబాద్‌లో డొమెస్టిక్ గ్యాస్ సిలిండర్ (14.2 కిలోలు) ధర రూ.965కి చేరింది. ఇప్పటివరకు కమర్షియల్ సిలిండర్ (19 కిలోలు) ధర రూ.2,105కు పెరిగింది.
