Anand Mahindra : ఆనంద్ మహీంద్రాపై కేసు.. స్పందించిన మహీంద్రా & మహీంద్రా

తన కుమారుడు చనిపోయాడని దానికి కారణం ఆ కంపెనీయే అంటూ ఆనంద్ మహీంద్రాపై కేసు పెట్టాడు ఓ వ్యక్తి.

Anand Mahindra : ఆనంద్ మహీంద్రాపై కేసు.. స్పందించిన మహీంద్రా & మహీంద్రా

Anand Mahindra

Case against Anand Mahindra : ఉత్తరప్రదేశ్ లోని కాన్పూర్ లో ఓ యువకుడు చనిపోయాడు. దీంతో ప్రముఖ పారిశ్రామిక వేత్త ఆనంద్ మహీంద్రా (Anand Mahindra)పై కేసు (Police case)లో నమోదైంది. ఆనంద్ మహీంద్రాతో పాటు మహీంద్రా అండ్ మహీంద్రా సంస్థపై కూడా కేసు నమోదు అయ్యింది. మహీంద్రా సంస్థ తనను మోసం చేసిందని తన యువకుడు ప్రాణాలు కోల్పోటానికి కారణం అంటూ రాజేశ్ మిశ్రా అనే వ్యక్తి పోలీసులకు ఫిర్యాదు చేయగా పోలీసులు ఆనంద్ మహీంద్రాతో పాటు మరో 12 మందిపై కేసు నమోదు చేశారు.

అసలు విషయం ఏమిటంటే.. రాజేశ్ మిశ్రా (Rajesh Mishra)అనే వ్యక్తి తన కుమారుడు అపూర్వ్ కు 2020లో మహీంద్రా అండ్ మహీంద్రా (Mahindra Group chairman)కు చెందిన స్కార్పియో కారు కొని గిఫ్టుగా ఇచ్చారు. ఈ కారులో ప్రమాదం జరిగినప్పుడు డ్రైవ్ చేసేవారు.. ప్రయాణీకులు ప్రాణాలు కోల్పోకుండా సేఫ్టీ కోసం ఎయిర్ బ్యాగులు ఉంటాయని సదరు కంపెనీ ప్రకటించింది. ఎవరైనా కారు కొనే సమయంలో ఫీచర్స్ తో పాటు సేఫ్టీని దృష్టిలో పెట్టుకునే కొంటారు. అలాగే రాజేశ్ మిశ్రా తన కుమారుడు అపూర్వ్ రూ.17.39 లక్షలు పెట్టి మహీంద్రా కంపెనీకి చెందిన స్కార్పియో కారును కొని గిఫ్ట్ ఇచ్చాడు.

2000 Rupees Note : మరో నాలుగు రోజులు మాత్రమే.. గడువు పొడగింపుపై ఆర్బీఐ ఏం చెబుతుది..

కానీ అపూర్వ్ (Apoorv) ప్రయాణించే సయమంలో కారు ప్రమాదానికి గురైంది కానీ ఎయిర్ బ్యాగులు తెరుచుకోలేదు. ఫలితంగా అపూర్వ్ ప్రమాదంలో మరణించాడు. దీంతో రాజేశ్ మిశ్రా మహీంద్రా కంపెనీ కారు భద్రత విషయంలో తనను మోసం చేసింది అంటూ ఆ కంపెనీ అధినేత ఆనంద్ మహీంద్రాతో పాటు మహీంద్రా అండ్ మహీంద్రా సంస్థపై కూడా కేసు పెట్టాడు. రాజేశ్ మిశ్రా ఫిర్యాదు మేరకు కాన్ఫూర్ పోలీసులు మహీంద్రాతో పాటూ మరో 12 మందిపై పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. స్కార్పియో కారులో ఎయిర్‌బ్యాగ్స్ తెరుచుకోని కారణంగా తన కుమారుడు మరణించాడంటూ రాజేశ్ మిశ్రా అనే వ్యక్తి పోలీసులను ఆశ్రయించడంతో ఈ కేసు నమోదైంది.

కాగా రాజేశ్ మిశ్రా కుమారుడు అపూర్వ్ 2022 జనవరి 14న తన స్నేహితులతో కలిసి స్కార్పియోలో లక్నో నుంచి కాన్పూర్ కు తిరిగొస్తుండగా కారు ప్రమాదానికి గురైంది. జనవరి నెలలో మంచు పొగ వల్ల రోడ్డు సరిగా కనిపించదు. ఫలితంగా రోడ్డు ప్రమాదాలు జరుగుతుంటాయి. అదే జరిగింది అపూర్వ్ తన స్నేహితులతో కలిసి ప్రయాణించే సమయంలో. అపూర్వ్ స్వయంగా డ్రైవ్ చేస్తుండగా మంచు ఎక్కువగా ఉండటంతో రోడ్డు సరిగా కనబడక వారు ప్రయాణిస్తున్న మహీంద్రా కంపెనీ కారు స్కార్పియో డివైడర్‌ను ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో అపూర్వ్ అక్కడికక్కడే మరణించాడు.

దీంతో కుమారుడ్ని కోల్పోయిన రాజేశ్‌ మిశ్రా తల్లడిల్లిపోయాడు. సేఫ్టీ అనుకుని కొన్న కారు వల్లే తన కుమారుడు మరణించాడంటూ కారులోని లోపాలను ఎత్తి చూపుతు పోలీసులకు ఫిర్యాదు చేశాడు. కారు ప్రమాదంలో కుమారుడు చనిపోయాక జరిగాల్సిన కార్యక్రమాలు చూసుకుని మిశ్రా కారు షోరూంకు వెళ్లి మీరు చెప్పిన సేఫ్టీలేవీ కారులో పనిచేయలేదు ఫలితంగా నా కుమారుడ్ని పోగొట్టుకున్నానంటూ ఆవేదన వ్యక్తంచేశారు. తన కుమారుడు సీట్ బెల్టు పెట్టుకున్నా ఎయిర్ బ్యాగ్స్ తెరుచుకోలేదని ఫిర్యాదు చేశారు. కారు భద్రత విషయంలో కంపెనీ తనను మోసం చేసిందని.. సంస్థ తప్పుడు విధానాలను అవలంబించిందంటూ వాపోయారు. అసలు కారులో ఎయిర్ బ్యాగ్స్ ఏర్పాటు చేయలేదని కూడా వెల్లడించారు. అమ్మకానికి ముందే కారును క్షుణ్ణంగా తనిఖీ చేసి ఉంటే ఇంతటి ఘోరం జరిగి ఉండేది కాదన్నారు.

Also Read: మోదీ ప్రభుత్వం గుడ్ న్యూస్.. సొంతింటి కలను నిజం చేసుకోవడం ఇప్పుడు మరింత సులభం.. మీకోసం పూర్తి వివరాలు

మిశ్రా చేసిన వాదనల్ని ఫోరూమ్ సిబ్బంది పట్టించుకోలేదు. పైగా వాగ్వాదానికి దిగారు. మాటా మాటా పెరిగింది. దీంతో రాజేశ్ కంపెనీ డైరెక్టర్ల ఆదేశాల మేరకు సంస్థ మేనేజర్లు తనను, తన కుటుంబాన్ని బెదిరించారని కూడా రాజేశ్ ఆరోపించారు. పోలీసులకు ఫిర్యాదు చేశారు. కంపెనీ అధినేత ఆనంద్ మహీంద్రాతో పాటూ మరో 12 మందిపై ఐపీసీ సెక్షన్ 420(చీటింగ్), 287, సెక్షన్ 304-ఏతో పాటూ మరికొన్ని సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు.

మహీంద్రా & మహీంద్రా వివరణ..
స్కార్పియో S9 వేరియంట్‌లో ఎయిర్‌బ్యాగ్‌లు లేవన్న దానిపై మహీంద్రా & మహీంద్రా వివరణ ఇచ్చింది. 2020లో తయారు చేసిన స్కార్పియో S9 వేరియంట్‌లో ఎయిర్‌బ్యాగ్‌లు ఉన్నాయని స్పష్టం చేసింది. ప్రమాదం జరిగిన కారులో ఉన్న ఎయిర్‌బ్యాగ్‌ల పనితీరులో ఎటువంటి లోపం లేదని తమ విచారణలో తేలిందని వెల్లడించింది. ఈ సంఘటన జనవరి 2022లో జరిగిందని, కేసు కోర్టు పరిధిలో ఉందని.. న్యాయవిచారణకు పూర్తిగా సహకరిస్తామని ప్రకటించింది.