సేఫ్ గానే ఉంది.. సిగ్నల్ రావొచ్చు : 2 కిలోమీటర్ల ఎత్తు నుంచి పడిపోయిన ల్యాండర్

సేఫ్ గానే ఉంది.. సిగ్నల్ రావొచ్చు : 2 కిలోమీటర్ల ఎత్తు నుంచి పడిపోయిన ల్యాండర్

Updated On : September 9, 2019 / 9:41 AM IST

ఇండియన్ స్పేస్ రీసెర్చ ఆర్గనైజేషన్ ఆశలు వదులుకోకుండా చేస్తున్న పరిశోధనకు మరో గుడ్ న్యూస్ వచ్చింది. శనివారం ఉదయం సిగ్నల్ అందుకోకుండా పోయిన చంద్రయాన్-2 అంతర్భాగమైన ల్యాండర్ ఆచూకీ తెలిసింది. చంద్రుని తలంపై 2.1కి.మీ దూరం నుంచి ల్యాండర్ పడినప్పటికీ ముక్కలవకుండా అలాగే ఉండడం పట్ల హర్షం వ్యక్తం చేస్తున్నారు శాస్త్రవేత్తలు. 

(ల్యాండర్+ప్రజ్ఞాన్ రోవర్‌తో కలిపి 1,471 కేజీలు. ప్రజ్ఞాన్ రోవర్ బరువు 27కేజీలు) ఇంత బరువుతో అంత పైనుంచి పడితే ముక్కలు అవ్వాల్సిందే. అలాంటిదేం సంభవించలేదు. కానీ, ఒక పక్కకు వంగి ఉందన్న విషయాన్ని ఇస్రో గుర్తించింది. విక్రమ్ ల్యాండర్‌లోపల ప్రజ్ఞాన్ రోవర్ కూడా ఉంది. ల్యాండర్ ముక్కలై ఉంటే  పనిచేసే అవకాశాలు తక్కువగా ఉండేవి. 

ఇస్రో చెబుతున్నదాని ప్రకారం.. ముక్కలు కాకుండా ఉండటం పట్ల రీ కమ్యూనికేషన్‌కు ప్రయత్నిస్తున్నారు శాస్త్రవేత్తలు. 14రోజుల పాటు చంద్రుని తలంపై ఉండగల ల్యాండర్‌ను పనిచేయించేందుకు తీవ్రంగా శ్రమిస్తున్నారు. భూమిపై ఉన్న ఆర్బిట్‌తో కమ్యూనికేషన్ కట్ అయింది. 

 సిగ్నల్‌ను తిరిగి సంపాదించడం కష్టమైనప్పటికీ చంద్రునిపైనే ఉంది కాబట్టి యాంటినాల సహాయంతో దానిని స్పందించే ప్రయత్నం చేస్తున్నట్లు శాస్త్రవేత్తలు వెల్లడించారు. విక్రమ్ మూడు పే లోడ్లతో ల్యాండ్ అయింది. రేడియో అనాటమి ఆఫ్ మూన్ బౌన్డ్ హైపర్ సెన్సిటివ్ లోనోస్పియర్ అండ్ అట్మాస్పియర్, చంద్రాస్ సర్ఫేస్ థర్మో ఫిజికల్ ఎక్స్‌పెరిమెంట్, ఇన్‌స్ట్రూమెంట్ ఫర్ ల్యూనార్ సీస్మిక్ యాక్టివిటీలతో ప్రయాణిస్తుంది.