ఇండిగో విమానంలో బాంబు: ఎయిర్‌పోర్ట్‌లో సెక్యూరిటీ అలర్ట్

  • Published By: vamsi ,Published On : October 13, 2019 / 04:16 AM IST
ఇండిగో విమానంలో బాంబు: ఎయిర్‌పోర్ట్‌లో సెక్యూరిటీ అలర్ట్

Updated On : October 13, 2019 / 4:16 AM IST

ఉత్తరప్రదేశ్‌లోని లక్నోలో అమౌసీ ఎయిర్‌పోర్టులో చెన్నై వెళ్లాల్సిన ఇండిగో విమానంలో బాంబు ఉందనే సమాచారం కలకలం రేపింది. దీంతో సెక్యూరిటీ సిబ్బంది విమానంలో నలుమూలలా వెతకడం మొదలెట్టారు. అయితే సెక్యురిటీ సిబ్బందికి ఎటువంటి అనుమానాస్పద వస్తువు లభ్యం కాలేదు.

బాంబ్ స్క్వాడ్ కూడా తనిఖీలు చేపట్టగా.. బాంబు మాత్రం దొరకలేదు. చివరకు విషయం అబద్ధం అని వెల్లడైంది. బాంబు ఉందనే సమాచారం నిరాధారమని తేలడంతో ఆందోళనకు గురైన ప్రయాణికులు ఊపిరి పీల్చుకున్నారు.

ఇటువంటి సమాచారం అందించిన పీయూష్ వర్మ అనే వ్యక్తిని సెక్యూరిటీ సిబ్బంది అదుపులోకి తీసుకున్నారు. పీయూష్ వర్మ షాజహాన్‌పూర్ జిల్లా ఆసుపత్రిలో క్వాలిటీ మేనేజర్‌గా పనిచేస్తున్నాడు. పీయూష్ మానసిక వ్యాధితో బాధపడుతున్నాడని అతని కుటుంబ సభ్యులు చెబుతున్నారు. బాంబు లేదని తేలడంతో విమానం కాస్త ఆలస్యంగా చెన్నైకి బయలుదేరింది.