Attack on Pregnant : గుడి ముందు నిలబడి దణ్ణం పెట్టుకుంటున్న గర్భిణీని ఈడ్చుకెళ్లిన దుండగులు

Attack on Pregnant : గుడి ముందు నిలబడి దణ్ణం పెట్టుకుంటున్న గర్భిణీని ఈడ్చుకెళ్లిన దుండగులు

Chennai Chain Snatchers

Updated On : April 14, 2021 / 2:27 PM IST

chennai Chain Snatcher : రోజు రోజుకు సమాజంలో ప్రశ్నార్థకంగా మారుతోంది. డబ్బు కోసం సాటి మనుషుల్నే దారుణంగా ప్రాణాలు తీసేస్తున్నారు. మనిషిని సృష్టించిన డబ్బే మనిషిని నడిపిస్తోంది. ప్రాణాలకు విలువ లేకుండా పోతోంది అనటానికి చెన్నైలో జరిగిన ఓ సంఘటన చూస్తుంటే ఈ మాటలు అక్షర సత్యాలుగా అనిపిస్తాయి. నిండు గర్భవతిగా ఉన్నామెను ఇద్దరు వ్యక్తులు దారుణంగా నడిరోడ్డుపై ఈడ్చిపారేశారు. గుడి ముందు నిలబడి దేవుడికి దణ్ణం పెట్టుకుంటున్న గర్భిణిపై ఇద్దరు దండగులు దారుణంగా దాడి చేసిన అత్యంత పాశవిక ఘటన గత శుక్రవారం జరిగింది.

తమిళనాడు రాజధాని చైన్నైలోని పల్వరంలోని రేణుకానగర్‌లో గీత అనే 25 మహిళ రోడ్డు పక్కనే ఉన్న ఓ గుడి ముందు నిలబడి దేవుడికి దండం పెట్టుకుంటోంది. ఆమె ఎనిమిది నెలల గర్భవతి. ఆమె దేవుడికి దండం పెట్టుకుంటున్న సమయంలోనే అక్కడికి ఇద్దరు వ్యక్తులు బైక్‌పై వచ్చారు. పక్కనే ఆగారు. ఆ ఇద్దరిలో ఒకరు బైక్‌ దిగి ఆమె పక్కకు వచ్చాడు.

వచ్చీ రావటంతోనే ఆమె మెడ ఉన్న బంగారు గొలుసును లాక్కెళ్లేందుకు ప్రయత్నించాడు. అది గమనించిన గీత సదరు దొంగను తీవ్రంగా ప్రతిఘటించింది.. కానీ ఎంతకు ఆ దుర్మార్గుడు గీతను వద్దల్లేదు. నెట్టిపారేశాడు. దీంతో గర్భంతో ఉన్న గీత రోడ్డుపై పడిపోయింది. అయినా వదలని ఆ దుర్మార్గుడు మెడలోని చైన్‌ను లాగుతూ కొంచెం దూరం ఆమెను ఈడ్చుకెళ్లాడు. చివరికి ఆ గోలుసును లాక్కొని వచ్చిన పని అయిపోవటంతో అక్కడ నుంచి పారిపోయాడు.

కనీసం గర్భవతి అని కూడా చూడకుండా ఆమెపై పాల్పడిన దుశ్చర్యకు సంబంధించిన దృశ్యాలన్నీ అక్కడకు సమీపంలో ఉనన ఓ సీసీటీవీ కెమెరాలో రికార్డ్‌ అయ్యింది. దీనికి సంబంధించిన వీడియో వైరల్‌గా మారింది. ఈ వీడియో చూసినవారు గర్భిణిపై దారుణంగా వ్యవహరించిన దుండగులను కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేస్తున్నారు. ఈ ఘటన జరిగిన తరువాత గీత భర్త.. పోలీసులకు ఫిర్యాదు చేయటంతో కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపడుతున్నారు. సీసీ టీవీ ఫుటేజ్ ను పరిశీలించి దర్యాప్తు కొనసాగిస్తున్నారు.