కరోనా భయమే లేదు : బట్టల షాపులకు ఎగబడ్డ జనాలు..సీజ్ చేసిన అధికారులు

  • Published By: nagamani ,Published On : October 20, 2020 / 04:17 PM IST
కరోనా భయమే లేదు : బట్టల షాపులకు ఎగబడ్డ జనాలు..సీజ్ చేసిన అధికారులు

Updated On : October 20, 2020 / 4:57 PM IST

chennai Kumaran Silks shop sealed : పండుగ వచ్చిందంటే కొత్త బట్టలుకట్టుకోవాల్సిందే. ఇప్పుడు దసరా..దీపావళి పండుగలు రానున్న క్రమంలో ప్రజలు బట్టల షాపులకు ఎగబడ్డారు. దసరా..దీపావళి సందర్భంగా డిస్కౌంట్లతో షాపుల యజమానులు ప్రకటిస్తుంటారు. ఇదిలా ఉండగా..అసలే కరోనా సీజన్..ఆపై పండుగల సీజన్ కూడా..బట్టలషాపుల వారి డిస్కౌంట్లతో చెన్నైలో జనాలు బట్టల షాపులకు ఎగబడ్డారు…



https://10tv.in/super-fan-gopi-krishnan-and-his-family-in-arangur-tamil-nadu/
సీజన్ వచ్చిందంటే చాలు జనంతో దుకాణాలు కష్టమర్లతో కళకళలాడిపోతాయి. ముఖ్యంగా దసర, దీపావళి పండుగలకు బట్టలు కొనటం ఆనవాయితీగా వస్తోంది.అసలే కరోనా వల్ల లాక్ డౌన్ లో దుకాణాలు మూతపడి ఉండటంతో ఆయా షాపుల యాజమాన్యాలు నష్టాల్లో కూరుకుపోయారు.



ఈ క్రమంలో దసరా దీపావళి సందర్భంగానైనా తమ వ్యాపారాలను తిరిగి కోలుకునేలా చేసుకోవటానికి డిస్కౌంట్లు ప్రకటించారు.దీంతో జనాలు కరోనా భయం కూడా లేకుండా బట్టల షాపులకు ఎగబడ్డారు. కరోనా నిబంధనలు కూడా పట్టించుకోవటంలేదు. చెన్నైలో బట్టల షాపులోకి జనాలు భారీగా తరలిరావటంతో అధికారులు ఆయా షాపులను సీజ్ చేశారు. కేసు నమోదు చేసి నోటీసులు పంపించారు.


చెన్నై త్యాగరాయనగర్‌లో ఉన్న కుమారన్ సిల్క్స్ షాపింగ్ మాల్‌కు మంచి ఆదరణ ఉంటుంది. మిగతాషాపులన్నీ ఒక ఎత్తు ఈ షాపు మరో ఎత్తు అన్నట్లుగా ఉంటుంది. ముఖ్యంగా పండుగ సీజన్‌లో కుమరన్న సిల్కస్ షాపింగ్ మాల్ జన జాతరను తలపిస్తుంది. ఈకరోనా కాలంలో కూడా జనాలు అదేమాదిరిగా ఎగబడ్డారు. కొంతమంది మాస్కులు కూడా పెట్టుకోలేదు.ఇక భౌతికదూరం అనే మాటే మర్చిపోయారు. దీనిపై సమాచారం అందుకున్న చెన్నై కార్పొరేషన్ అధికారులు అక్కడికి చేరుకున్నారు. నిబంధనలు ఉల్లంఘించడంతో కుమారన్ సిల్క్స్ దుకాణానికి సీల్ వేశారు.