లాక్‌డౌన్‌లో జైలు నుంచి బయటకు.. దొంగతనానికి వచ్చి మహిళపై లైంగికదాడి

లాక్ డౌన్ కారణంగా కరోనా భయంతో దేశంలో దొంగతనాలు, ఇతర నేరాలు తగ్గుముఖం పట్టగా.. అక్కడక్కడ మాత్రం దొంగతనాలు సాగుతూనే ఉన్నాయి. లేటెస్ట్‌గా తమిళనాడులోని చెన్నై నగరంలో అన్నానగర్, తిరుమంగళం పరిసరాల్లో దొంగతనానికి వచ్చిన ఓ వ్యక్తి నిద్రిస్తున్న మహిళపై లైంగిక దాడికి పాల్పడ్డాడు.
సీసీ కెమెరాల్లోని దృశ్యాల మేరకు అతనిని గుర్తించిన పోలీసులు.. అజ్ఞాతంలో ఉన్న దొంగ కోసం వెతుకుతున్నారు. వివరాల్లోకి వెళ్తే.. అన్నాగనర్‌లో ఓ అపార్ట్ మెంట్‌లో దొంగతనానికి వచ్చిన వ్యక్తిని అక్కడి స్థానికులు గమనించి పట్టుకోవడానికి ప్రయత్నించారు. అయితే.. వారికి దొరకకుండా దొంగ తిరుమంగళం వైపు పరుగులు తీశాడు.
అనంతరం తిరుమంగళం లోని ఓ ఇంటి పై అంతస్తులో ఒంటరిగా నిద్రిస్తున్న మహిళపై తన ప్రతాపం చూపించాడు. మహిళపై లైంగికదాడికి పాల్పడ్డాడు. ఆమె గట్టిగా కేకలు వెయ్యడంతో చుట్టుపక్కల వారు రాగా అతను పారిపోయాడు. స్థానికులు ఆమెను ఆసుపత్రిలో చేర్పించారు.
సమాచారం అందుకున్న అన్నాగనర్ పోలీసులు రంగంలోకి దిగి.. అన్నానగర్, తిరుమంగళం పరిసరాల్లోని సీసీ కెమెరాల్లోని దృశ్యాల మేరకు ఆ యువకుడు అమింజికరైకు చెందిన వేల్‌మురుగన్ కుమారుడు రామకృష్ణన్ అని గుర్తించారు. చోరీ కేసులో అరెస్టైన అతను లాక్‌డౌన్ పుణ్యమా అని బయటకు వచ్చాడు. జైలు నుంచి రాగానే మళ్లీ అదే పనులు చేస్తున్నట్లు పోలీసులు చెప్పారు. (దిక్కుమాలిన కరోనా : లక్ష మంది మృతి..ఇంకెంత మంది ? )