ఛత్తీస్‌గఢ్ లో నక్సల్స్ ఘాతుకం..నలుగురు జవాన్లు మృతి

ఛత్తీస్‌గఢ్ రాష్ట్రంలో నక్సల్స్ ఘాతుకానికి పాల్పడ్డారు. మంగళవారం(మార్చి-23,2021)నారాయణ్​పుర్​ జిల్లాలో జవాన్లే లక్ష్యంగా IEDని పేల్చారు.

ఛత్తీస్‌గఢ్ లో నక్సల్స్ ఘాతుకం..నలుగురు జవాన్లు మృతి

Blast

Updated On : March 23, 2021 / 7:47 PM IST

Chhattisgarh ఛత్తీస్‌గఢ్ రాష్ట్రంలో నక్సల్స్ ఘాతుకానికి పాల్పడ్డారు. మంగళవారం(మార్చి-23,2021)నారాయణ్​పుర్​ జిల్లాలో జవాన్లే లక్ష్యంగా IEDని పేల్చారు. ఈ ఘటనలో నలుగురు జవాన్లు మృతి చెందారు. ఈ బాంబు పేలుడు ఘటనలో మరికొందరు జవాన్లు తీవ్రంగా గాయపడ్డారని ఛత్తీస్​గఢ్ డీజీపీ డీఎమ్ అవస్తి తెలిపారు.​ పేలుడు జరిగిన ప్రాంతంలో సెర్చ్ ఆపరేషన్ జరుగుతోంది.

అధికారిక వివరాల ప్రకారం..నారాయణ్ పేర్ జిల్లాలోని కదీనార్ నుంచి కన్హార్ గాన్ కు 27మంది DRG సిబ్బందిని తీసుకెళ్తున్న బస్సుని ఐడీతో పేల్చారు నక్సల్స్. యాంటీ మావోయిస్టు ఆపరేషన్‌ చేపట్టి తిరిగి వస్తుండగా ఈ దాడి జరిగింది.పేలుడు దాటికి వీరిలో నలుగురు సంఘటనా స్థలంలోనే మృతిచెందగా మరో 15 మంది తీవ్రంగా గాయపడ్డారు. బాధితుల్లో ఐదుగురి పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం. 45వ బెటాలియన్‌కు చెందిన ఐటీబీపీ సిబ్బంది క్షతగాత్రులను తరలించేందుకు సహాయక చర్యలు చేపట్టారు.

Blast2

Blast2