కొరడాతో కొట్టించుకున్న చత్తీస్గఢ్ సీఎం

Chhattisgarh CM Bhupesh Baghel celebrated Govardhan puja, followed this ritual చత్తీస్గఢ్ ముఖ్యమంత్రి భూపేశ్ బఘేల్ కొరడాతో కొట్టించుకున్నారు. అయితే,తనదే తప్పు చేసి శిక్షగా కొరడా దెబ్బలు తినలేదు. ఆయన కొరడాతో కొట్టించుకోవడానికి ఉన్న కారణం సంప్రదాయాలను పాటించడమే.
సంప్రదాయాలను పాటించడంలో భాగంగానే సీఎం భూపేశ్ కొరడా దెబ్బలు తిన్నారు. దుర్గ్ జిల్లా జజంగిరి గ్రామంలో సంప్రదాయంగా జరిగే గోవర్ధన్పూజలో పాల్గొన్న సీఎం..ప్రజల శ్రేయస్సు కోసం చేతి మీద పలుమార్లు కొరడాతో కొట్టించుకున్నారు. కాగా,దీపావళి అనంతరం జరిగే గోవర్ధన్ పూజలో బఘేల్ ప్రతీ సంవత్సరం ఇలా చేస్తారనే విషయం తెలిసిందే.
ఓ వ్యక్తి కొరడాతో.. భూపేశ్ బఘేల్ చేతిపై పలుమార్లు కొట్టాడు. అయితే, ఇది తమ సాంప్రదాయంలో భాగమని స్థానికులు చెబుతున్నారు.
#WATCH छत्तीसगढ़: गोवर्धन पूजा के अवसर पर सबकी मंगलकामना के लिए मुख्यमंत्री भूपेश बघेल ने दुर्ग ज़िले के ग्राम जजंगिरी, कुम्हारी में सांटा का प्रहार झेलने की परंपरा निभाई। pic.twitter.com/8cGNhDiXSG
— ANI_HindiNews (@AHindinews) November 15, 2020