Liquor home delivery : మద్యం హోమ్ డెలివరీ చేస్తున్న ప్రభుత్వం..
లాక్ డౌన్ ఉన్నాగానీ మందుకు ఏమాత్రం కొరత ఉండదు? అని ప్రభుత్వమే హామీ ఇస్తే.. మందుబాబులకు పండుగే. మద్యం హోమ్ డెలివరీ ఇచ్చేందుకు అనుమతులను ఇవ్వటమే కాదు దాన్ని మే 10 నుంచి అమలులోకి తీసుకొచ్చింది ఛత్తీస్ ఘడ్ ప్రభుత్వం. ఇది ఖచ్చితంగా మందుబాబులకు మాంచి కిక్కెక్కించే వార్తే అనటంలో ఎటువంటి సందేహం లేదు.

Liquor Home Delivery
Liquor home delivery in Chhattisgarh : ఓ పెగ్ వేస్తే మందుబాబు ఎవ్వడి మాటా వినడు. సీతయ్య అయిపోతాడు. కానీ మందుబాబు భయపపడతాడండోయ్..దేనికంటే ‘లాక్ డౌన్’ కు. లాక్ డౌన్ వస్తే మందు దొరకదు కదా..అందుకు? కానీ లాక్ డౌన్ ఉన్నాగానీ మందుకు ఏమాత్రం కొరత ఉండదు? అని సాక్షాత్తూ ప్రభుత్వమే హామీ ఇస్తే..అప్పుడు మందుబాబుల ఫీలింగ్ ఎలా ఉంటుంది? లాక్ డౌన్ వస్తే ఏంటీ బొక్కా..అని అనుకుంటాడు మందుబాబు. ఎందుకంటే మందు చక్కగా చేతికే అందివస్తుంటే లాక్ డౌన్ అయితే ఏంటీ? ఏ డౌన్ అయితే ఏంటీ అంటూ ఓ చక్కేసి చిందేస్తాడు. ఇంతకీ అసలు విషయం ఏమిటంటే..ఆన్ లైన్ లో కూడా మందు హోమ్ డెలివరీ ఇవ్వటానికి పర్మిషన్ ఇచ్చింది ఛత్తీస్ గఢ్ ప్రభుత్వం. ఇవ్వటమే కాదు ఈరోజు నుంచి దాన్ని అమలులోకి తీసుకొచ్చింది కూడా.ఇది ఖచ్చితంగా మందుబాబులకు మాంచి కిక్కెక్కించే వార్తే అనటంలో ఎటువంటి సందేహం లేదు.
ఛత్తీస్ ఘడ్ లో లాక్ డౌన్ అమలులో ఉంది. దీంతో మందుబాబులకు మద్యం దొరక్క అల్లాడిపోతున్నారు. అందుబాటులో లేకపోవడంతో కల్తీ మద్యం తయారీకి శ్రీకారం చుట్టేశారు కొంతమంది కేటుగాళ్లు. మరోపక్క కిక్కు కోసం జనాలు శానిటైజర్లు తాగి చనిపోతున్న ఘటనలు జరుగుతున్నాయి. ఈక్రమంలో మద్యాన్ని హోమ్ డెలివరీ చేయాలనే ఛత్తీస్ ఘడ్ ప్రభుత్వం నిర్ణయించింది. దీన్ని అమలు చేసేందుకు అన్ని సన్నాహాలు చేసింది. అది ఈరోజు నుంచే అంటే మే 10,2021నుంచే ప్రారంభమైంది.
ఉదయం 9 గంటల నుంచి రాత్రి 8 గంటల వరకు హోమ్ డెలివరీ ఉంటుందని సంబంధిత అధికారి తెలిపారు. ఆన్ లైన్లో ఆర్డర్ చేసి..డబ్బులు చెల్లిస్తే ఆర్డర్ చేసినవారికి సమీపంలోని వైన్ షాపు నుంచి మద్యాన్ని డెలివరీ చేస్తారని చత్తీస్ గఢ్ మార్కెటింగ్ కార్పొరేషన్ లిమిటెడ్ తెలిపింది. ఆన్ లైన్ లో మద్యం ఆర్డర్‌ను చేయటానికి ప్రజలు మొబైల్‌లో CSMCL అనే యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోవాలని తెలిపింది. రాష్ట్ర ప్రభుత్వం చేసిన ప్రకటనతో మందుబాబులు ఖుషీ ఖుషీ అయిపోతున్నారు. మూడు సీసాలు ఆరు పెగ్గుల్లా కిక్కెక్కిపోతున్నారు.