మళ్లీ చైనా అడ్డుపుల్ల : అజర్‌పై ఉగ్ర ముద్ర వేసేందుకు అభ్యంతరం

జైషే మహ్మద్ చీఫ్ మసూద్ అజర్‌ను అంతర్జాతీయ ఉగ్రవాదిగా ప్రకటించాలన్న భారత ప్రయత్నాలకు మళ్లీ బ్రేక్ పడింది. అతడిని ఉగ్రవాదిగా ప్రకటించకుండా చైనా మరోసారి అడ్డుపడింది. ఐక్యరాజ్యసమతిలోని శాశ్వత సభ్య దేశాలన్నీ భారత డిమాండ్‌కు మద్దతివ్వగా… డ్రాగన్ కంట్రీ మాత్రం ఆఖరి నిమిషంలో అభ్యంతరం తెలిపింది.
Read Also : ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రమ్ యూజర్లకు ఇబ్బందులు.. సైబర్ దాడులు జరిగాయా?
అభ్యంతరాలకు ఇచ్చిన గడువు మరో అరగంటలో ముగియనుందనేవరకు మౌనంగా ఉన్న చైనా… ఆఖర్లో సాంకేతికంగా అడ్డుపుల్ల వేసింది. అజహర్‌ను అంతర్జాతీయ ఉగ్రవాదిగా ప్రకటించాలని ఐక్యరాజ్య సమితిలో ఇలాంటి ప్రయత్నాలు చేయడం 10 ఏళ్లకాలంలో ఇది నాలుగోసారి కావడం గమనార్హం.
తాజా పరిణామంపై భారత విదేశాంగ శాఖ స్పందించింది. భారత పౌరులపై దాడికి పాల్పడిన వారిని శిక్షించేందుకు అందుబాటులో ఉన్న అన్ని మార్గాలని అనుసరిస్తామని వెల్లడించింది. చైనా మరోసారి అడ్డుకోవడం వల్ల విచారం వ్యక్తం చేసింది.
Read Also : Twitter Trending : చైనా వస్తువులను బ్యాన్ చేయాల్సిందే