Ladakh Border : తూర్పు లడఖ్ సరిహద్దుల్లో మళ్లీ చైనా సైన్యం కదలికలు

చైనా మళ్లీ సరిహద్దులో ఉద్రిక్తతలు రెచ్చగొట్టేలా వ్యవహరిస్తోంది. దాదాపు ఏడాది పాటు సరిహద్దుల్లో ఘర్షణలకు కారణమైన చైనా సైన్యం..మళ్లీ తూర్పు లడఖ్ సమీపంలో తన కార్యకలాపాల్ని చేపడుతోంది.

Ladakh Border : తూర్పు లడఖ్ సరిహద్దుల్లో మళ్లీ చైనా సైన్యం కదలికలు

China

Updated On : May 18, 2021 / 9:38 PM IST

Ladakh Border చైనా మళ్లీ సరిహద్దులో ఉద్రిక్తతలు రెచ్చగొట్టేలా వ్యవహరిస్తోంది. దాదాపు ఏడాది పాటు సరిహద్దుల్లో ఘర్షణలకు కారణమైన చైనా సైన్యం..మళ్లీ తూర్పు లడఖ్ సమీపంలో తన కార్యకలాపాల్ని చేపడుతోంది. తూర్పు లడఖ్​ సెక్టార్​కు సమీపంలో పీపుల్స్ లిబరేషన్ ఆర్మీ(PLA)సైనిక విన్యాసాలు నిర్వహిస్తోంది.చైనా బలగాలు తమ భాభాగంలో 100 కిలోమీటర్లు అంతకంటే ఎక్కువ దూరంలో సైనిక విన్యాసాలు నిర్వహిస్తున్నట్లు సమాచారం.

పాంగాంగ్​ సరస్సు ప్రాంతం నుంచి ఇరు దేశాల భద్రతా దళాల ఉపసంహరణ ఒప్పందంలో అపరిష్కృతంగా మిగిలి ఉన్న ఘర్షణ ప్రాంతాలు.. హాట్​ స్ప్రింగ్స్​, గోగ్రా హైట్స్​ పై ఇరు దేశాల మధ్య చర్చలు ఇంకా కొనసాగుతున్న సమయంలోనే తాజా పరిణామాలు కీలకంగా మారాయి. చైనా ఆర్మీ కదలికల్ని భారత సైన్యం నిశితంగా గమనిస్తోంది. అదేవిధంగా సరిహద్దుల్లోని బలగాలను భారత్ అలర్ట్ చేసింది. ఇండో-టిబెటిన్​ సరిహద్దు పోలీసులు సహా వాయుసేన, సైన్యాన్ని తూర్పు లడఖ్ సెక్టార్​కు సమీపంలో భారత్ మోహరించింది.

కాగా, చాలా సంవత్సరాలుగా ప్రతి వేసవికాలంలో విన్యాసాలు చేయడానికి చైనా లిబరేషన్​ ఆర్మీ తూర్పు లడఖ్​ సరిహద్దు ప్రాంతాలకు వస్తోంది. గత వేసవిలోనూ ఇలాగే వచ్చి.. తూర్పు లడఖ్ ​లో ఘర్షణలకు తెరలేపింది. చైనా ఆర్మీ విన్యాసాల కోసం తూర్పులద్దాఖ్​కు సమీపంలోకి వచ్చిందని తెలిసిన వెంటనే అప్రమత్తమైన భారత సైన్యం అక్కడికి వెెళ్లింది. ఫలితంగా అప్పటినుంచి సరిహద్దులో ప్రతిష్టంభన ఏర్పడింది. అయితే, చైనా సైన్యం తన సొంత ప్రదేశాలకు తిరిగి వెళ్తుందని అనుకున్నప్పటికీ అది నెరవేరలేదు. అంతటితో ఆగకుండా చైనా సైన్యం.. సరిహద్దులకు సమీపంలోని తమ ప్రాంతాల్లో బంకర్లను నిర్మిస్తోంది.యితే.. చైనా సైన్యం తన సొంత ప్రదేశాలకు తిరిగి వెళ్తుందని అనుకున్నప్పటికీ అది నెరవేరలేదు. అంతటితో ఆగకుండా చైనా సైన్యం.. సరిహద్దులకు సమీపంలోని తమ ప్రాంతాల్లో బంకర్లను నిర్మిస్తోంది. ఈ బలగాల తరలింపుతో షుగర్​ సెక్టార్​, సెంట్రల్​ సెక్టార్​, ఈశాన్య సెక్టార్​లు సైనిక బలగాలతో పటిష్ఠంగా ఉన్నాయి. తూర్పు లడఖ్ లోని గల్వాన్ లోయలో గతేడాది జాన్ లో ఇరు దేశాల సైనికుల మధ్య జరిగిన ఘర్షణలో 20మంది భారత జవాన్లు అమరులవ్వగా,పెద్ద సంఖ్యలో చైనా సైనికులు చనిపోయినట్లు వార్తలు వచ్చిన విషయం తెలిసిందే.

ఇక, ఈ ఏడాది ఫిబ్రవరిలో పాంగాంగ్​ సరస్సు దక్షిణ తీరం వెంబడి వ్యూహాత్మక ప్రణాళికలో భాగంగా.. ఫింగర్​ ప్రాంతం నుంచి ఇరుదేశాలు బలగాల ఉపసంహరణ ప్రక్రియను చేయగలిగాయి. అయితే ఇతర ఘర్షణ ప్రాంతాల నుంచి బలగాల ఉపసంహరణకు సంబంధించి ఇరు దేశాలు మరోసారి చర్చలు జరపాల్సి ఉంది. గోగ్రా, హాట్​ స్ప్రింగ్స్​, దెప్సాంగ్​ ప్రాంతాల నుంచి చైనా బలగాలు మరలి వెళ్లాలని భారత్​ గట్టిగా వాదిస్తోంది. అయితే ప్రతిష్టంభన నెలకొన్నప్పటి నుంచి చైనా బలగాలు.. హోతన్​, గరీ గున్సా, కష్గర్​ ప్రాంతాల్లో 200 కిలోమీటర్ల దూరంలోని లక్ష్యాల్ని ఛేదించగల హెచ్​ క్యూ-9 లాంటి వాయు క్షిపణుల్ని మోహరించాయి. భారత్ కూడా రఫేల్​ యుద్ధవిమానాలు, తదితర నౌకల్ని తూర్పు లడఖ్ సరిహద్దుల్లో మోహరిస్తోంది.