కరోనా దెబ్బకు కాలుష్యం మాయం…ఎందుకంటే!

  • Published By: veegamteam ,Published On : March 2, 2020 / 05:21 AM IST
కరోనా దెబ్బకు కాలుష్యం మాయం…ఎందుకంటే!

Updated On : March 2, 2020 / 5:21 AM IST

కరోనా ఇపుడు ఈ మాట వింటేనే జనం హడలెత్తి పోతున్నారు. ఎంతో మందిని బలితీసుకుంటున్న ఈ వైరస్‌… ప్రపంచ దేశాల్ని వణికిస్తోంది. అయితే ఇప్పుడు కరోనా వల్ల ఓ ప్రయోజనం కూడా ఉంది. అదేంటంటే, మొన్నటి వరకు ప్రపంచంలో అత్యధిక కాలుష్యం ఉన్న దేశాల జాబితా తీస్తే చైనా మొదటి స్థానంలో ఉండేది. కాని కరోనా ఎఫెక్ట్ వల్ల నెల రోజులుగా ఎక్కడివారు అక్కడే ఉండిపోయారు. వాహనాల రాకపోకలు కూడా ఎక్కడికక్కడ నిలిచిపోవడంతో కాలుష్య రహిత చైనాగా నిలిచింది.  

ఈ విషయాన్ని అమెరికాకు చెందిన నాసా ప్రయోగ సంస్థ ప్రకటించింది. గతంతో పోలిస్తే ప్రస్తుతం ఉత్పత్తి కేవలం 40శాతం మాత్రమే ఉందని తెలిపారు. గతంలో చైనీస్‌ ఫుడ్‌ అంటూ పాములు, కప్పలు, గబ్బిలాలను వేయించుకుని తిన్నారు. ఇప్పుడు మాత్రం ఎవ్వరు వాటి జోలికి కూడా పోవటంలేదు. దీంతో జంతుబలి కాస్త తగ్గంది. ముఖ్యంగా భార్య భర్తలు కలవడం కూడా తగ్గిందని నిపుణులు చెబుతున్నారు. 

Also Read | బీ అలర్ట్: హైదరాబాద్ గాంధీలో కరోనా కలకలం

మొత్తానికి వాయు కాలుష్యం మాత్రం ఎప్పుడు లేని స్థాయిలో తగ్గింది. కరోనా వల్ల కష్టాలే కాకుండా చైనాకు మంచి కూడా జరిగిందన్నమాట. ఇక కరోనాకు కేరాఫ్ అడ్రెస్ గా నిలిచిని వూహాన్ లో అయితే ఈ పరిస్థితి చాలా స్పష్టంగా కనిపిస్తోంది. ఈ విషయాన్ని నిర్దారించేకునేందకు NASA, ESA కరోనా ముందు ఫొటోలు కరోనా తర్వాత ఫొటోలను తీసింది.