Emergency Landing: యూఏఈ భారతీయ వ్యాపారవేత్తకు తప్పిన ప్రమాదం

యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్‌కు చెందిన భారతీయ వ్యాపారవేత్త, అంతర్జాతీయ రిటైల్ సంస్థ లులు గ్రూప్‌ చైర్మన్ ఎంఏ యూసుఫ్ అలీ, ఆయన భార్య, మరో నలుగురు ప్రయాణిస్తున్న హెలికాప్టర్ అత్యవసర ల్యాండింగ్ అయింది.

Emergency Landing: యూఏఈ భారతీయ వ్యాపారవేత్తకు తప్పిన ప్రమాదం

Chopper Carrying Businessman Makes Emergency Landing In Kerala

Updated On : April 12, 2021 / 7:20 AM IST

Chopper Emergency Landing In Kerala : యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్‌కు చెందిన భారతీయ వ్యాపారవేత్త, అంతర్జాతీయ రిటైల్ సంస్థ లులు గ్రూప్‌ చైర్మన్ ఎంఏ యూసుఫ్ అలీ, ఆయన భార్య, మరో నలుగురు ప్రయాణిస్తున్న హెలికాప్టర్ అత్యవసర ల్యాండింగ్ అయింది. కోచిలోని ఓ పొలంలో క్రాష్ ల్యాండింగ్ అయిన హెలికాప్టర్ లులు గ్రూప్‌ కంపెనీకి చెందినది.

పనన్‌గడ్ ప్రాంతంలో ఉదయం 9 గంటలకు ఈ ప్రమాదం జరిగినట్టు లులు గ్రూప్ ఇంటర్నేషనల్ వెల్లడించింది. ప్రమాదం జరిగిన వెంటనే సమాచారం అందుకున్న పోలీసులు యూసుఫ్ అలీ, ఆయన భార్య, మరో ఇద్దరు, ఇద్దరు పైలట్లను ప్రైవేటు ఆసుపత్రికి తరలించారు.

ప్రమాదంలో ఎవరికి ఎలాంటి గాయాలు కాలేదని, అందరూ క్షేమంగా ఉన్నారని పోలీసులు వెల్లడించారు. యూసుఫ్ అలీ ప్రస్తుతం కేరళలో ఉన్నారు. కోచిలోని ఓ ప్రైవేటు ఆస్పత్రికి తరలించి అబ్జర్వేషన్ లో ఉంచినట్టు పోలీసులు పేర్కొన్నారు.

ఆస్పత్రిలో ఉన్న బంధువును కలుసుకునేందుకు కొచ్చి నుంచి బయలుదేరారు. వాతావరణం ఒక్కసారిగా మారిపోయి భారీ వర్షం కురిసింది. అప్రమత్తమైన పైలట్ ముందుజాగ్రత్త చర్యగా సురక్షితమైన స్థలంలో హెలికాప్టర్‌ను క్రాష్ ల్యాండ్ చేశాడు.