CJI NV Ramana : సుప్రీంకోర్టులో అరుదైన దృశ్యం..తెలుగులోనే సీజేఐ రమణ విచారణ

బుధవారం ఉదయం సుప్రీంకోర్టులో అరుదైన దృశ్యం కనిపించింది.

CJI NV Ramana : సుప్రీంకోర్టులో అరుదైన దృశ్యం..తెలుగులోనే సీజేఐ రమణ విచారణ

Ramana

Updated On : July 28, 2021 / 3:51 PM IST

CJI NV Ramana బుధవారం ఉదయం సుప్రీంకోర్టులో అరుదైన దృశ్యం కనిపించింది. వివాహానికి సంబంధించిన ఓ కేసు ఇవాళ సుప్రీంకోర్టులో విచారణకు వచ్చింది. కక్షిదారు అయిన ఓ మహిళ తన వాదనలును వినిపించాల్సి ఉంది. అయితే ఇంగ్లీష్ లో మాట్లాడేందుకు ఆమె ఇబ్బంది పడుతున్నారని జస్టిస్ రమణ అర్థం చేసుకున్నారు.

దీంతో.. మీకు ఇంగ్లీష్ లో వాదనలు వినిపించడం ఇబ్బందిగా ఉందా అని సీజేఐ.. సదరు మహిళని అడిగారు. దీంతో ఆమె అవును అని సమాధానమిచ్చింది. దీంతో వాదనలని తెలుగులోని వినిపించాలని ఆమెకు సీజేఐ సూచించారు. ఆమె చెప్పిన విషయాన్ని జస్టిస్ రమణ.. ఇంగ్లీష్ లోకి అనువదించి, తన సహచర న్యాయమూర్తి జస్టిస్ సూర్యకాంత్ కు వివరించారు. కాగా, జస్టిస్ ఎన్​.వి.రమణకు మాతృభాషపై మమకారం ఎక్కువనే విషయం తెలిసిందే. తెలుగువాడిగా పుట్టినందుకు గర్వించాలని అనేక సందర్భాల్లో ఆయన అన్నారు.