Mumbai Airport : ముంబై ఎయిర్‌పోర్టులో తప్పిన ప్రమాదం.. ఒకే రన్‌వేపై రెండు విమానాలు.. ఇండిగో ల్యాండింగ్.. ఎయిరిండియా టేకాఫ్..!

Mumbai Airport : ఎయిరిండియా జెట్ టేకాఫ్ అయిన కొద్ది క్షణాలకే ఇండిగో విమానం ల్యాండ్ అవుతోంది. ఇండిగో విమానం ఇండోర్ నుంచి ముంబైకి వెళ్తుండగా.. ఎయిరిండియా విమానం కేరళలోని తిరువనంతపురం వైపు బయలుదేరింది.

Mumbai Airport : ముంబై ఎయిర్‌పోర్టులో తప్పిన ప్రమాదం.. ఒకే రన్‌వేపై రెండు విమానాలు.. ఇండిగో ల్యాండింగ్.. ఎయిరిండియా టేకాఫ్..!

IndiGo Touchdown-Air India Take-Off On Same Runway ( Screenshot Grab from Video )

Mumbai Airport : ముంబై విమానాశ్రయంలో భారీ ప్రమాదం తృటిలో తప్పింది. ఎయిరిండియా జెట్ టేకాఫ్ అవుతున్న అదే రన్‌వేపై ఇండిగో విమానం ల్యాండ్ అయింది. ఆ రెండు విమానాల మధ్య కేవలం కొంత దూరం మాత్రమే ఉంది. అదృష్టవశాత్తూ ఎలాంటి ప్రమాదం జరగలేదు. దాంతో రెండు విమానాల్లో ప్రయాణిస్తున్న వందలాది మంది ప్రయాణికులు పెనుప్రమాదం నుంచి బయటపడ్డారు.

సమాచారం అందిన వెంటనే స్పందించిన ఏవియేషన్ రెగ్యులేటర్ డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ దర్యాప్తు ప్రారంభించింది. దీనికి కారణమైన ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్ అధికారిని వెంటనే విధుల్లో నుంచి తొలగించింది. ఈ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియా వైరల్ అవుతోంది.

Read Also : Poco M6 4G Launch : కొత్త ఫోన్ కొంటున్నారా? పోకో M6 4జీ ఫోన్ వచ్చేస్తోంది.. ఈ నెల 11నే లాంచ్!

ఆ వీడియోలో రెండు విమానాలు ఒకే రన్‌వేపై కనిపిస్తున్నాయి. ఎయిరిండియా జెట్ టేకాఫ్ అయిన కొద్ది క్షణాలకే ఇండిగో విమానం ల్యాండ్ అవుతోంది. ఇండిగో విమానం ఇండోర్ నుంచి ముంబైకి వెళ్తుండగా.. ఎయిరిండియా విమానం కేరళలోని తిరువనంతపురం వైపు బయలుదేరింది.

ఇండోర్-ముంబై విమాన పైలట్ ఏటీసీ సూచనలను పాటించినట్లు ఇండిగో ఒక ప్రకటనలో తెలిపింది. జూన్ 8, 2024న ఇండోర్ నుంచి వచ్చిన ఇండిగో ఫ్లైట్ (6E 6053)కి ముంబై ఎయిర్‌పోర్ట్‌లో ఏటీసీ (ATC) ల్యాండింగ్ క్లియరెన్స్ ఇచ్చింది. పైలట్ ఇన్ కమాండ్ అప్రోచ్ ఏటీసీ సూచనలను అనుసరిస్తూ ల్యాండింగ్‌ చేసేందుకు ప్రయత్నించింది. ”ఇండిగోలో ప్రయాణీకుల భద్రత మాకు చాలా ముఖ్యం. ప్రొజిజర్ ప్రకారమే ఈ ఘటనపై నివేదించాం”అని పేర్కొంది.

ఎయిర్ ఇండియా కూడా ఏటీసీ తన విమానాన్ని టేకాఫ్ కోసం క్లియర్ చేసిందని తెలిపింది. AI657 విమానం జూన్ 8న ముంబై నుంచి త్రివేండ్రంకు టేకాఫ్ అవుతోంది. ఎయిరిండియా విమానం రన్‌వేలోకి ఎంట్రీ అయ్యేందుకు ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్ ద్వారా క్లియరెన్స్ కోరింది. ఆ వెంటనే టేకాఫ్ కోసం క్లియరెన్స్ వచ్చింది. ఎయిరిండియా విమానం నిర్దేశించిన విధానాలకు అనుగుణంగానే టేకాఫ్‌కు సిద్ధమైంది. ఎయిర్‌లైన్స్‌కు ఇచ్చిన క్లియరెన్స్‌పై పూర్తి వివరణకు అధికారులు దర్యాప్తు ప్రారంభించారని ఒక ప్రకటనలో తెలిపింది.

Read Also : Realme GT 7 Pro Specifications : 50ఎంపీ పెరిస్కోప్ కెమెరాతో రియల్‌మి GT 7 ప్రో వచ్చేస్తోంది.. కీలక స్పెషిఫికేషన్లు లీక్..!