Karnataka : చెప్పులు కుట్టే వ్యక్తికి ప్రధాని మోడీ నుంచి ఆహ్వానం.. ఢిల్లీకి రమ్మంటూ..
చెప్పులు కుట్టుకుని జీవనం సాగిస్తున్న ఓ వ్యక్తికి ఢిల్లీకి రమ్మంటూ ప్రధాని మోడీ నుంచి ఆహ్వానం అందింది. ఒక్కసారిగా ఆ వ్యక్తి ఫేమస్ అయిపోయాడు. దేనికోసం ఆహ్వానం అందుకున్నాడో తెలుసా?

Karnataka
Karnataka : చెప్పులు కుట్టే వ్యక్తికి ప్రధాని మోడీ నుంచి ఢిల్లీకి రమ్మంటూ ఆహ్వానం వచ్చింది. కర్నాటకకు చెందిన ఆ వ్యక్తి ఇప్పుడు వార్తల్లో నిలిచాడు. ఇంతకీ అతనెవరు? అతనికి ఎందుకు ఆహ్వానం అందింది… చదవండి.
కర్నాటక కుందపురాకి చెందిన మణికంఠ ఇప్పుడు తన ఏరియాలో ఫేమస్ అయిపోయాడు. ప్రధాని మోడీ నుంచి ఢిల్లీకి రమ్మంటూ ఆహ్వానం అందుకున్నాడు మరి. విషయం ఏంటంటే వచ్చే ఏడాది జనవరి 26 న న్యూఢిల్లీలోని ఎర్రకోటపై జరిగే గణతంత్ర దినోత్సవాల్లో పాల్గొనేందుకు మణికంఠకు ఆహ్వానం అందింది. అంతే మణికంఠ రాత్రికి రాత్రి వాళ్ల ఏరియాలో సెలబ్రిటీ అయిపోయాడు.
కుందాపురలోని శాస్త్రి సర్కిల్‌లో చెప్పులు కుడుతూ జీవనం సాగిస్తున్న మణికంఠ ప్రధాన మంత్రి స్వనిధి పథకం లబ్దిదారునిగా ఈ ఆహ్వానం అందుకున్నాడు. మణికంఠ మొట్టమొదటిసారి విమాన ప్రయాణం కూడా చేయబోతున్నాడు. ఇంతటి అద్భుతమైన అవకాశం రావడంతో సంబరపడిపోతున్నాడు. రిపబ్లిక్ డే ఈవెంట్‌కు తనలాంటి సాధారణ వ్యక్తిని ఆహ్వానించడం చాలా సంతోషంగా ఉందని చెబుతున్నాడు మణికంఠ.
Hazel Keech : యువరాజ్ సింగ్ క్యాన్సర్ తరువాత.. అతడి భార్య తీసుకున్న నిర్ణయం ఏంటో తెలుసా..?
ఇప్పటివరకు రిపబ్లిక్ డే ఈవెంట్‌ను టీవీ స్క్రీన్ మీద చూసిన మణికంఠ ఎటువంటి ఇబ్బందులు పడకుండా ఢిల్లీ వెళ్లడానికి పట్టణ మున్సిపాలిటీ అధికారులు అతని ప్రయాణానికి ఏర్పాట్లు చేస్తున్నారట. స్ధానికంగా చెప్పులు కుట్టే వ్యక్తి గౌరవ అతిధిగా రిపబ్లిక్ డే వేడుకల్లో పాల్గొనడానికి వెళ్తుండటం తమకు గర్వకారణం అంటున్నారు స్ధానికులు.