Coca-Cola Tea : భారతదేశం మార్కెట్‌లో ఇక కొత్తగా కోకా కోలా టీ.. కొత్తగా ప్రారంభం

ప్రపంచ దిగ్గజ కూల్ డ్రింక్ సంస్థ కోకాకోలా భారతదేశంలో కొత్తగా టీ మార్కెట్‌లోకి ప్రవేశించనుంది. దేశంలో కొత్తగా తాము హానెస్ట్ టీ పేరిట టీ పానీయాలను విక్రయించనున్నట్లు కోకాకోలా ఇండియా తాజాగా వెల్లడించింది. ఈ బ్రాండ్ టీని కోకాకోలా అనుబంధ సంస్థ హానెస్ట్ మార్కెట్ లోకి ప్రవేశపెట్టింది....

Coca-Cola Tea : భారతదేశం మార్కెట్‌లో ఇక కొత్తగా కోకా కోలా టీ.. కొత్తగా ప్రారంభం

Coca Cola Tea

Coca-Cola Tea : ప్రపంచ దిగ్గజ కూల్ డ్రింక్ సంస్థ కోకాకోలా భారతదేశంలో కొత్తగా టీ మార్కెట్‌లోకి ప్రవేశించనుంది. దేశంలో కొత్తగా తాము హానెస్ట్ టీ పేరిట టీ పానీయాలను విక్రయించనున్నట్లు కోకాకోలా ఇండియా తాజాగా వెల్లడించింది. ఈ బ్రాండ్ టీని కోకాకోలా అనుబంధ సంస్థ హానెస్ట్ మార్కెట్ లోకి ప్రవేశపెట్టింది. ఆర్గానిక్ గ్రీన్ టీని కోల్‌కతాకు చెందిన లక్ష్మీ టీ కో ప్రైవేట్ లిమిటెడ్ కు చెందిన మకైబారి టీ ఎస్టేట్ నుంచి తీసుకోనున్నట్లు కంపెనీ అధికారులు తెలిపారు.

ALSO READ : Bengaluru Incident : యాక్సిడెంట్ కాదు మర్డర్.. సంచలన నిజం బయటపెట్టిన సీసీటీవీ ఫుటేజీ

కోల్‌కతా నగరంలో జరిగిన బెంగాల్ గ్లోబల్ బిజినెస్ సమ్మిట్ (బిజిబిఎస్) ఏడవ ఎడిషన్‌లో రెండు కంపెనీల మధ్య దీనికి సంబంధించి ఒప్పందం కుదిరింది. వినియోగదారులకు విస్తృతంగా టీ పానీయాన్ని అందించడమే ఈ లాంచ్ వెనుక ఉన్న ఆలోచన అని కోకా-కోలా ఇండియా, నైరుతి ఆసియా సీనియర్ అధికారి తెలిపారు. ఐస్‌డ్ గ్రీన్ టీ లెమన్-తులసి, మ్యాంగో వేరియంట్‌లలో వస్తుందని కోకాకోలా తెలిపింది.

ALSO READ : కారులో రూ.2కోట్లు.. హైదరాబాద్ పెద్ద అంబర్‌పేట్‌లో భారీగా నగదు పట్టివేత

ఐస్‌డ్ గ్రీన్ టీ కోసం కోకా కోలా ఇండియా లక్మీ గ్రూప్‌కు చెందిన మకైబరీతో ఒప్పందం కుదుర్చుకుంది. బెంగాల్ గ్లోబల్ బిజినెస్ సమ్మిట్ ముగింపు రోజున బాటిల్ ఐస్‌డ్ గ్రీన్ టీని అధికారికంగా ప్రారంభించారు. సేంద్రీయ గ్రీన్ టీతో తయారు చేసిన ఐస్‌డ్ గ్రీన్ టీ ప్రత్యేకంగా లక్ష్మీ గ్రూప్ మకైబారి ఎస్టేట్ నుంచి సేకరించారు.

ALSO READ : Akbaruddin Owaisi : అక్బరుద్దీన్ ఒవైసీ పోలీసును హెచ్చరిస్తున్న వీడియో వైరల్.. కేసు నమోదు.. బీజేపీ నేతల రియాక్షన్

‘‘మా కొత్త రెడీ-టు డ్రింక్ ఐస్‌డ్ గ్రీన్ టీని పరిచయం చేయడం మాకు చాలా ఆనందంగా ఉంది. హానెస్ట్ టీతో, మేం వినియోగదారులకు అద్భుతమైన గ్రీన్ టీ ఆధారిత పానీయాన్ని అందిస్తున్నాం’’ అని కోకా కోలా ఇండియా, సౌత్‌వెస్ట్ ఆసియా మార్కెటింగ్ – హైడ్రేషన్, కాఫీ, టీ కేటగిరీ డైరెక్టర్ కార్తీక్ సుబ్రమణియన్ చెప్పారు. డార్జిలింగ్‌లో మకైబారి కంటే గొప్ప టీ ఎస్టేట్ లేదని కోల్‌కతాకు చెందిన లక్ష్మీ గ్రూప్ మేనేజింగ్ డైరెక్టర్ రుద్ర ఛటర్జీ చెప్పారు.