యూపీని వణికిస్తోన్న చలి : 120 ఏళ్ల రికార్డ్ బ్రేక్ చేస్తూ అతి తక్కువ టెంపరేచర్
ఉత్తరప్రదేశ్ ను చలి వణికిస్తోంది. 120 ఏళ్ల రికార్డ్ ను బ్రేక్ చేస్తూ అతి తక్కువ టెంపరేచర్ ను నమోదు చేసింది.

ఉత్తరప్రదేశ్ ను చలి వణికిస్తోంది. 120 ఏళ్ల రికార్డ్ ను బ్రేక్ చేస్తూ అతి తక్కువ టెంపరేచర్ ను నమోదు చేసింది.
ఉత్తరప్రదేశ్ ను చలి వణికిస్తోంది. 120 ఏళ్ల రికార్డ్ ను బ్రేక్ చేస్తూ అతి తక్కువ టెంపరేచర్ ను నమోదు చేసింది. కాన్పూర్ లో టెంపరేచర్ సున్నా డిగ్రీని తాకినట్లు వాతావరణ శాఖ అధికారులు వెల్లడించారు. యూపీ రాజధాని లక్నో కూడా సున్నాకు చేరువగా.. 0.7 డిగ్రీలు నమోదైనట్లు చెప్పారు. అలాగే రాష్ట్రంలోని చాలా ప్రాంతాల్లో టెంపరేచర్ 10 డిగ్రీలు దాటడం లేదు.
ఉత్తర భారతాన్ని చలి వణికిస్తోంది. ఢిల్లీలో 4.8 డిగ్రీల కనిష్ఠ ఉష్ణోగ్రత నమోదైంది. ఇది నిన్న, మొన్న నమోదైన కనిష్ట ఉష్ణోగ్రతల కంటే మరీ తక్కువ. పొగమంచు కారణంగా ఢిల్లీ మీదుగా రాకపోకలు సాగించే 34 రైళ్లు ఆలస్యంగా నడిచాయి.
ఇక ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని పలు చోట్ల ఉష్ణోగ్రతలు మరింతగా పడిపోయాయి. దీంతో ప్రజలు చలికి వణుకుతున్నారు. భయటకు రావాలంటేనే హడలిపోతున్నారు. చలిమంటలు వేసుకుని ఉపశమనం పొందుతున్నారు.