Cold Wave : చలి పులి పంజా…గడ్డకట్టిన సిస్సు లేక్

కనిష్ఠ ఉష్ణోగ్రతలు సాధారణం కంటే.. రెండు డిగ్రీలు త‌క్కువ‌గా న‌మోద‌వుతాయంటోంది వాతావరణ శాఖ. ఎముకలు కొరికే చలి.. ప్రజలకు ఉక్కిరిబిక్కిరి చేస్తోంది.

Cold Wave In India : భారతదేశంపై చలి పులి పంజా విసురుతోంది. గత పదేళ్లలో ఎప్పుడూ లేనంత చలి తీవ్రత.. దేశంపై విరుచుకుపడుతోంది. ఎముకలు కొరికే చలి.. ప్రజలకు ఉక్కిరిబిక్కిరి చేస్తోంది. ఉత్తరాదితో పాటు.. తెలుగు రాష్ట్రాలు చలి ప్రభావంతో చిగురుటాకులా వణుకుతున్నాయి. అటు.. ఉత్తర భారతదేశాన్ని చలిగాలులు వ‌ణికిస్తున్నాయి. అతి త‌క్కువ స్థాయిలో ఉష్ణోగ్రత్తలు న‌మోద‌వుతున్నాయక్కడ. శ‌నివారం ఢిల్లీలో కనిష్ట ఉష్ణోగ్రత 6 డిగ్రీల సెల్సియస్‌గా నమోదైంది. ఈ సీజన్‌లో ఇప్పటివరకు ఇదే అతి త‌క్కువ ఉష్ణోగ్రత అంటున్నారు వాతావరణ శాఖ అధికారులు. ఢిల్లీ, హర్యానా, రాజస్థాన్, పంజాబ్, యూపీలో ఉష్ణోగ్రతలు భారీగా పడిపోతున్నాయి. ఉత్తరాఖండ్‌లో రెండు రోజులుగా చల్లటి గాలులు వీస్తుండటంతో పాటు.. హిమపాతం కురుస్తోంది. దీంతో.. ఉత్తరాఖండ్‌లో ఎల్లో అలెర్ట్ జారీ చేసింది ఐఎండీ. పంజాబ్, హర్యానా, ఉత్తర రాజస్థాన్, యూపీ, మధ్యప్రదేశ్లో చాలిగాలుల ప్రభావం మరో రెండు రోజులు ఉంటుందని తెలపింది వాతావరణ శాఖ. అటు.. జమ్మూకాశ్మీర్, ఉత్తరాఖండ్, హిమాచల్‌ప్రదేశ్‌లో హిమపాతం కొనసాగుతోంది. మధ్యాహ్నం వరకు కూడా.. చలి తీవ్రత ఉంటుండటంతో.. ప్రజలు ఇళ్ల నుంచి వచ్చేందుకే జంకుతున్నారు.

Read More : Coronavirus : కరోనా కేసులు, మళ్లీ పెరుగుతున్నాయి..జాగ్రత్త

ఈ ఏడాది.. కనిష్ఠ ఉష్ణోగ్రతలు సాధారణం కంటే.. రెండు డిగ్రీలు త‌క్కువ‌గా న‌మోద‌వుతాయంటోంది వాతావరణ శాఖ. మరోవైపు.. గ‌త సీజ‌న్ల కంటే ఈసారి పగటి ఉష్ణోగ్రత సాధారణం కంటే గణనీయంగా త‌గ్గిపోయింది. చలి గాలులు కూడా ఎక్కువ‌గానే వీస్తున్నాయి. మరో రెండ్రోజుల వరకు పగటి ఉష్ణోగ్రత సాధారణం కంటే తక్కువగానే ఉండే ప‌రిస్థితులున్నాయ‌ని అంచనా వేస్తోంది ఐఎండీ. అటు.. తెలుగు రాష్ట్రాల్లో మరింత చలి తీవ్రత పెరగనుంది. ఇప్పటికే రాత్రిళ్లు నెగళ్లు(చలిమంటలు) వేసుకుని ఉపశమనం పొందుతున్నారు. ఉత్తరం, ఈశాన్యం నుంచి వీస్తున్న చలి గాలులతో రానున్న 4 రోజుల్లో రాత్రి ఉష్ణోగ్రతలు పడిపోనున్నాయి. హైదరాబాద్‌లో కనిష్ఠ స్థాయిలో ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. తెలంగాణలో పలు జిల్లాల్లో అత్యల్ప ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి.

Read More : Jammu Kashmir : శ్రీనగర్‌లో ఎన్‌కౌంటర్ ఉగ్రవాది హతం

అటు.. తెలంగాణపై చలి పంజా విసురుతుంది. రాష్ట్రంలో ఎప్పుడూ లేనంతగా చలి చంపేస్తోంది. పదేళ్లలో ఎన్నడూ లేనంతగా ఉష్ణోగ్రతలు కనిష్ఠ స్థాయికి పడిపోతున్నాయి. డిసెంబర్‌లోనే అతి తక్కువ స్థాయికి ఉష్ణోగ్రతలు పడిపోతున్నాయి. రాష్ట్రంలో ఒక్కసారిగా ఉష్ణోగ్రతలు పడిపోవడంతో చలి పెరిగింది. హైదరాబాద్‌లో 9 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. రాత్రి వేళల్లో ఉష్ణోగ్రతలు మరింత పడిపోయే అవకాశముందని వాతావరణ తెలిపింది. హైదరాబాద్‌కు ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది.
చలిగాలులకు తెలంగాణ చిగురుటాకులా వణికిపోతుంది. గతంలో ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలోనే అత్యల్ప ఉష్ణోగ్రతలు నమోదయ్యేవి. కానీ ఇప్పుడు తెంగాణ రాష్ట్రవ్యాప్తంగా కనిష్ట ఉష్ణోగ్రతలు రికార్డు అవుతున్నాయి. హైదరాబాద్‌తో పాటు ఆదిలాబాద్‌, ఆసిఫాబాద్‌, సిరిసిల్ల, జగిత్యాల, మహబూబాబాద్‌ జిల్లాల్లో అత్యల్ప ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. దీంతో ఈ జిల్లాలకు వాతావరణ శాఖ ఆరెంజ్ అలర్ట్‌ జారీ చేసింది. హైదరాబాద్‌ శివారు ప్రాంతాలైన శేరిలింగంపల్లి, రాజేంద్రనగర్, హయత్‌నగర్ ప్రాంతాల్లో సింగిల్ డిజిట్ టెంపరేచర్ రికార్డు అవుతున్నాయి.

Read More : NANI : సోషల్ మీడియాలో అన్న మాటలకి నా వైఫ్ 10 సూట్స్ కొని పెట్టింది : నాని

ప్రతి ఏటా డిసెంబర్‌లో 18 డిగ్రీల సాధారణ ఉష్ణోగ్రతలు నమోదయ్యేవి. కానీ ఈసారి హైదరాబాద్ సిటీలో సాధారణం కంటే 5 డిగ్రీలు తగ్గి.. 13 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. తెలంగాణలో ఎల్లో అలర్ట్‌ను జారీ చేసింది వాతావరణ శాఖ. సోమవారం, మంగళవారం ఉష్ణోగ్రతలు మరింత తగ్గే అవకాశం ఉండటంతో ఆరెంజ్‌ అలర్ట్‌ను జారీ చేసింది. రాబోయే ఐదు రోజులు హైదరాబాద్‌తో పాటు తెలంగాణలోని అనేక ప్రాంతాల్లో కనిష్ట ఉష్ణోగ్రతలు మూడు నుంచి నాలుగు డిగ్రీల సెల్సియస్ తగ్గే అవకాశం ఉందని వాతావరణశాఖ తెలిపింది. అటు ఉపరితల గాలులు ప్రభావంతో రాత్రి ఉష్ణోగ్రతలు పడిపోతున్నాయి.

Read More : Hyderabad Temperature : పదేళ్ల తర్వాత హైదరాబాద్‌లో అత్యల్ప ఉష్ణోగ్రతలు

విశాఖ ఏజెన్నీలో చలి వణుకుపుట్టిస్తోంది. సాధారణ స్థాయి కన్నా ఉష్ణోగ్రతలు దారుణంగా పడిపోతున్నాయి. విశాఖ ఏజన్సీలో గత వారం రోజులుగా ఉష్ణోగ్రతలు భారీగా పడిపోతున్నాయి. మినుములూరు కాఫీ ఎస్టేట్‌లో 9, పాడేరు 10, అరకులోయలో 11 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. ఇక అంధ్రా కాశ్మీర్‌గా పిలిచే లంబసింగిలో రికార్డు స్థాయిలో 6 డిగ్రీల కనిష్ఠ ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. ఈ సీజన్లో తొలిసారి అత్యల్ప ఉష్ణోగ్రత ఇదే అంటున్నారు వాతావరణ శాఖ అధికారులు. ఉష్ణోగ్రతలు తగ్గడంతో పాటుగా తీవ్రంగా చలిగాలులు వీస్తున్నాయి. దీంతో ఉదయంపూట ప్రజలు పనులకు వెళ్లలేని పరిస్థితులు నెలకొన్నాయి. మంచు విపరీతంగా కురుస్తుండడంతో ప్రజల రోజువారీ కార్యక్రమాలకు అంతారాయం కలుగుతోంది. చలి తీవ్రతతో.. ఏజెన్సీ ప్రాంతాల్లో గిరిజనులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.