Ranbir Kapoor : బాలీవుడ్ ప్రముఖ నటుడు రణబీర్ కపూర్‌పై పోలీసులకు ఫిర్యాదు…ఎందుకంటే…

హిందువుల సెంటిమెంటును దెబ్బతీశారని ఆరోపిస్తూ బాలీవుడ్ ప్రముఖ నటుడు రణబీర్ కపూర్ పై పోలీసులకు ఫిర్యాదు చేశారు. క్రిస్మస్ పండుగ సందర్భంగా బాలీవుడ్ నటుడు రణబీర్ కపూర్, ఆయన కుటుంబసభ్యులు వేడుకలు జరుపుకుంటూ కేక్ పై మద్యాన్ని పోసి నిప్పంటించి జై మాతా ది అన్న వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.....

Ranbir Kapoor : బాలీవుడ్ ప్రముఖ నటుడు రణబీర్ కపూర్‌పై పోలీసులకు ఫిర్యాదు…ఎందుకంటే…

Ranbir Kapoor

Updated On : December 28, 2023 / 6:47 AM IST

Ranbir Kapoor : హిందువుల సెంటిమెంటును దెబ్బతీశారని ఆరోపిస్తూ బాలీవుడ్ ప్రముఖ నటుడు రణబీర్ కపూర్ పై పోలీసులకు ఫిర్యాదు చేశారు. క్రిస్మస్ పండుగ సందర్భంగా బాలీవుడ్ నటుడు రణబీర్ కపూర్, ఆయన కుటుంబసభ్యులు వేడుకలు జరుపుకుంటూ కేక్ పై మద్యాన్ని పోసి నిప్పంటించి జై మాతా ది అన్న వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. హిందూ మతంలో ఇతర దేవతలను పిలిచే ముందు అగ్ని దేవుణ్ణి ఆరాధిస్తారు.

ALSO READ : Ayodhya Ram Mandir : రామమందిర ప్రారంభ ఆహ్వానితులకు ప్రత్యేక బహుమతులు…ఏం ఇస్తారంటే…

అయితే రణబీర్ కపూర్, అతని కుటుంబ సభ్యులు ఉద్ధేశపూర్వకంగా క్రైస్తవ మతం పండుగను జరుపుకునే సమయంలో మద్యాన్ని ఉపయోగించారు, జై మాతా ది అని నినాదాలు చేశారని ఫిర్యాదులో ముంబయికు చెందిన సంజయ్ తివారీ పేర్కొన్నారు. తన న్యాయవాదులు ఆశిష్ రాయ్, పంకజ్ మిశ్రాల ద్వారా ముంబయిలోని ఘట్‌కోపర్ పోలీస్ స్టేషన్‌లో సంజయ్ తివారీ ఫిర్యాదు చేశారు.

ALSO READ : Bus Catches Fire : బస్సులో చెలరేగిన మంటలు…13మంది మృతి, మరో 17 మందికి గాయాలు

వైరల్ వీడియోలో హిందువుల సెంటిమెంట్‌ను దెబ్బతీసినందుకు రణబీర్ కపూర్‌పై ముంబయి పోలీసులకు ఫిర్యాదు చేసినా, ఈ కేసులో ఇంకా ప్రథమ సమాచార నివేదిక (ఎఫ్‌ఐఆర్) నమోదు కాలేదు. రణబీర్ కపూర్ తన మతపరమైన మనోభావాలను దెబ్బతీశారని సంజయ్ తివారీ పోలీసులకు సమర్పించిన ఫిర్యాదులో పేర్కొన్నారు.