Samosas : దారుణం.. సమోసాలలో కండోమ్‌లు, గుట్కా.. ఎక్కడో తెలుసా

కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాఫ్తు చేపట్టారు. ఈ ఘటనలో ప్రమేయం ఉన్న ఐదుగురిపై కేసు నమోదు చేశారు. ఇప్పటివరకు ఒకరిని అరెస్ట్ చేశారు.

Samosas : దారుణం.. సమోసాలలో కండోమ్‌లు, గుట్కా.. ఎక్కడో తెలుసా

Samosas

Updated On : April 8, 2024 / 7:22 PM IST

Samosas : పుణెలోని పింప్రి-చించ్ వాడ్ లోని ఒక ప్రముఖ కంపెనీ క్యాంటీన్ లో భయానక ఘటన వెలుగుచూసింది. అక్కడ సమోసాలలో కండోమ్ లు, రాళ్లు, పొగాకు, గుట్కా వంటివి కనిపించాయి. మార్చి 27న జరిగిన ఈ ఘటన తాజాగా వెలుగులోకి వచ్చింది. కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాఫ్తు చేపట్టారు. ఈ ఘటనలో ప్రమేయం ఉన్న ఐదుగురిపై కేసు నమోదు చేశారు. ఇప్పటివరకు ఒకరిని అరెస్ట్ చేశారు.

ఈ దారుణానికి ఒడిగట్టింది క్యాటరింగ్ కాంట్రాక్టర్ అని తెలిసింది. పాత కాంట్రాక్టర్ తో క్యాటరింగ్ కాంట్రాక్ట్ ను కంపెనీ రద్దు చేసుకుంది. కొత్త వారికి అవకాశం ఇచ్చింది. దీంతో కంపెనీ యాజమాన్యంపై పగబట్టిన పాత కాంట్రాక్టర్ ఈ దారుణానికి ఒడిగట్టాడనట్లు పోలీసుల విచారణలో తేలింది. ఈ ఘటన స్థానికంగా సంచలనం రేపింది. కాంట్రాక్ట్ కోసం ఇంత నీచానికి దిగజారడం ఏంటని మండిపడుతున్నారు. ఆ కాంట్రాక్టర్ ను కఠినంగా శిక్షించాలనే డిమాండ్లు వినిపిస్తున్నాయి.

కంపెనీ తన కాంట్రాక్ట్ ను రద్దు చేసుకవడాన్ని క్యాటరింగ్ కాంట్రాక్టర్ జీర్ణించుకోలేకపోయాడు. ఎలాగైనా కంపెనీ పేరు ప్రతిష్టలను దెబ్బతీయాలని ప్లాన్ చేశాడు. ఇందులో భాగంగానే ఈ దారుణానికి ఒడిగట్టాడు. కండోమ్ లు, గుట్కా, రాళ్లతో సమోసాలు చేశాడు. తద్వారా కంపెనీ యాజమాన్యానికి చెడ్డ పేరు తీసుకురావాలని అనుకున్నాడు. అయితే, పోలీసుల విచారణలో ఈ దారుణానికి పాల్పడింది పాత కాంట్రాక్టర్ అని తేలింది.

Also Read : ద్యావుడా.. ఆఫీసుకి టైమ్‌కి రమ్మన్నాడని.. సీనియర్ ఉద్యోగి హత్యకు సహచరుల కుట్ర