Congress Bus Yatra: బస్సు రెడీ అయింది, మరి ప్రయాణికులేరి!.. అయోమయంలో కాంగ్రెస్ బస్సు యాత్ర
యాత్రకు షెడ్యూలు ప్రకటించాక మార్పులు సరికాదని అధ్యక్షుడు శివకుమార్ అన్నట్లు సమాచారం. ఇలా రాష్ట్ర కాంగ్రెస్ పార్టీలో అంతుచిక్కని అయోమయం నెలకొంది. రాష్ట్ర శాసనసభ ఎన్నికలు ఏప్రిల్‌లో జరిగే అవకాశం ఉంది. మార్చిలో షెడ్యూలు విడుదల కావచ్చునని అంచనా. రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలు అధికార బీజేపీతో పాటు కాంగ్రెస్‌కు చాలా కీలకమైనవి.
Congress to take out bus yatra on the lines of 1999 Panchajanya yatra to display collective leadership
Congress Bus Yatra: బస్సు సిద్ధమైంది, డ్రైవరూ సిద్ధమయ్యారు. కానీ ప్రయాణికులే లేరన్నట్లు ఉంది కర్ణాటక కాంగ్రెస్ పార్టీ చేపట్టిన బస్సు యాత్ర. రాబోయే అసెంబ్లీ ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని బస్సు యాత్ర చేపట్టిన కాంగ్రెస్ పార్టీ.. దీనికి సంబంధించిన షెడ్యూల్ ఖరారు చేసింది. అయితే పార్టీ అభ్యర్థులను ప్రకటించకుండానే యాత్ర ప్రారంభయ్యేలా కనిపిస్తోంది. వాస్తవానికి ఈ ఏడాది చివరిలోనే దాదాపు అభ్యర్థులను ఖరారు చేస్తామని ప్రకటించిన కాంగ్రెస్ పార్టీ.. ఇప్పటి వరకు ఒక్క అభ్యర్థిని కూడా ఖరారు చేయలేదు. దీంతో అభ్యర్థులను ప్రకటించకుండానే యాత్ర చేపడితే బాగుండదని సొంత పార్టీ నుంచే అభిప్రాయాలు వస్తున్నాయి.
Rajasthan: టీచర్ రిక్రూట్మెంట్ పేపర్ లీక్.. పరీక్ష క్యాన్సల్, పోలీసుల అదుపులో 50 మంది
ఇక ఈ యాత్రలో ఇద్దరు ముఖ్యమంత్రి పదవి ఆశావాహులు రాష్ట్ర కాంగ్రెస్ అధ్యక్షుడు డీ.కే శివకుమార్, ప్రతిపక్ష నేత సిద్ధరామయ్య కలిసే పాల్గొననున్నారు. దీంతో పార్టీకి చాలా బలం చేకూరుతుందని కాంగ్రెస్ వర్గీయులు ఆనందంగానే ఉన్నప్పటికీ, అసెంబ్లీ ఎన్నికలు మరో నాలుగు నెలలే ఉన్న తరుణంలో అభ్యర్థుల ప్రకటన లేకపోవడంపై అసంతృప్తి వ్యక్తం అవుతోంది. ఒక నియోజకవర్గంలో ఆరేడుగురు ఆశావహులు ఉంటే ఎవరికివారుగా యాత్రకు స్వాగతాలు, ఇతరత్రా సభలు ఏర్పాటు చేస్తే నియోజకవర్గంలో గ్రూపులను రెచ్చగొట్టేలా చేసినట్లు అవుతుందని పార్టీ నేతలు అభిప్రాయ పడుతున్నారు.
Bharat Jodo Yatra: సోనియాతో దిగిన ఫొటో షేర్ చేస్తూ.. ఎమోషనల్ ట్వీట్ చేసిన రాహుల్
అయితే, యాత్రకు షెడ్యూలు ప్రకటించాక మార్పులు సరికాదని అధ్యక్షుడు శివకుమార్ అన్నట్లు సమాచారం. ఇలా రాష్ట్ర కాంగ్రెస్ పార్టీలో అంతుచిక్కని అయోమయం నెలకొంది. రాష్ట్ర శాసనసభ ఎన్నికలు ఏప్రిల్‌లో జరిగే అవకాశం ఉంది. మార్చిలో షెడ్యూలు విడుదల కావచ్చునని అంచనా. రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలు అధికార బీజేపీతో పాటు కాంగ్రెస్‌కు చాలా కీలకమైనవి. ఇక ఈ రెండు పార్టీలకు తోడు జేడీఎస్ సైతం అస్త్రాలు సిద్ధం చేసుకుంటోంది. ఈ రెండు పార్టీల నుంచి ఏమాత్రం వెనకడుగు పడినా అది జేడీఎస్‌కు లాభం చేకూరే ప్రమాదం లేకపోలేదు. ఇలా మూడుపార్టీలకు ఎన్నికలలో గెలుపు ప్రతిష్టాత్మకంగా మారింది.
Bharat Jodo Yatra: భారత్ జోడో యాత్రలో పాల్గొన్న కమల్ హాసన్.. రాహుల్‌తో కలిసి ఎర్రకోటవైపు అడుగులు
అధికార బీజేపీ తన కార్యక్రమాలేదో చేసుకుంటుంది. ఇక జేడీఎస్ పార్టీ పంచరత్న యాత్రను ప్రారంభించింది. ఇటీవలే 93 మందితో మొదటి జాబితాను కూడా ప్రకటించింది. కానీ రాష్ట్రంలో కీలకమైన ప్రతిపక్షంగా ఉన్న కాంగ్రెస్.. ఇటు పార్టీ నిర్ణయాలు సిద్ధం చేసుకోకుండా మరో వైపు అభ్యర్థులు ఖరారు కాకుండా బస్సుయాత్ర చేస్తే ఏం ప్రయోజనం ఉంటుందని పార్టీ నేతలు గందరగోళంలో పడినట్లు తెలుస్తోంది. బస్సు యాత్ర ద్వారా పార్టీలోని గ్రూపులను మరింత తీవ్రం చేయడం మినహా మరొకటి ఉండదనే అభిప్రాయాలు సైతం వ్యక్తమవుతున్నాయి.
