Jharkhand : గుర్రం ఎక్కి అసెంబ్లీకి వచ్చిన మహిళా ఎమ్మెల్యే..

జార్ఖండ్‌కు చెందిన కాంగ్రెస్ పార్టీ మ‌హిళా ఎమ్మెల్యే అంబా ప్ర‌సాద్ అంతర్జాతీయ మహిళా దినోత్సవం రోజున గుర్రపు స్వారీ చేస్తు అసెంబ్లీకి వచ్చారు.

Jharkhand : గుర్రం ఎక్కి అసెంబ్లీకి వచ్చిన మహిళా ఎమ్మెల్యే..

Women Mla Rides A Horse To Jharkhand Assembly

Updated On : March 8, 2022 / 4:02 PM IST

jharkhand women mla rides a horse to  assembly : జార్ఖండ్‌కు చెందిన కాంగ్రెస్ పార్టీ మ‌హిళా ఎమ్మెల్యే అంబా ప్ర‌సాద్ అంతర్జాతీయ మహిళా దినోత్సవం (మార్చి 8,2022) రోజు వినూత్నంగా అసెంబ్లీకి వచ్చారు. గుర్రంపై స్వారీ చేస్తు అసెంబ్లీకి వచ్చారు ఎమ్మెల్యే అంబా ప్రసాద్.

అంత‌ర్జాతీయ మ‌హిళా దినోత్సవం నేప‌థ్యంలో ఆమె గుర్రం స్వారీ చేయటంపై ఏమన్నా విశేషం ఉందా? అని ఆమెను మీడియా ప్రశ్నించగా..దానికి ఆమె సమాధానం చెబుతూ..‘ప్ర‌తి మ‌హిళ‌లోనూ దుర్గా, ఝాన్సీరాణీ ఉంది’ అని అన్నారు.

ధైర్యంతో మ‌హిళ‌లు ప్ర‌తి స‌వాల్‌ను ఎదుర్కోవాల‌ని ఆమె ఈ సందర్భంగా మహిళలకు సూచించారు. ప్రతి రంగంలోనూ మ‌హిళ‌లు రాణిస్తున్నార‌ని, పేరెంట్స్ త‌మ ఆడపిల్లలను చదవించాలని ఈ సందర్భంగా ఆమె సూచించారు.