మోడీ బయోపిక్ ఆపండి…ఈసీని కోరిన కాంగ్రెస్

మోడీ బయోపిక్ ఆపండి…ఈసీని కోరిన కాంగ్రెస్

Updated On : March 25, 2019 / 3:35 PM IST

బాలీవుడ్ స్టార్ హీరో వివేక్ ఒబెరాయ్ టైటిల్ పాత్రలో నటించిన మోడీ బయోపిక్‌ ‘పీఎం నరేంద్ర మోడీ’ విడుదలను ఎన్నికలు ముగిసేంత వరకు ఆపాలని కేంద్ర ఎన్నికల సంఘాన్ని కాంగ్రెస్ కోరింది.షెడ్యూల్ ప్రకారం ఈ సినిమా ఏప్రిల్ 5న విడుదల కావాల్సి ఉండగా, లోక్‌సభ ఎన్నికల తొలి విడత పోలింగ్ ఏప్రిల్-11,2019న జరుగుతుంది.తుది విడత పోలింగ్ మే 19న జరుగుతుంది. ఎన్నికల సమయంలో ఈ సినిమా విడుదల చేయడం ఓటర్లను ప్రలోభపెట్టడమే అవుతుందని, ఇది ఎన్నికల ప్రవర్తనా నియమావళి ఉల్లంఘన కిందకు వస్తుందని ఈసీకి ఫిర్యాదు చేసినట్లు కాంగ్రెస్ సీనియర్ లీడర్ కపిల్ సిబల్ తెలిపారు.

 ఈ సినిమాలోని నటుడు,ముగ్గురు నిర్మాతలు బీజేపీకి చెందినవారని సిబల్ అన్నారు.డైరెక్టర్‌ కూడా వైబ్రెంట్ గుజరాత్‌‌ కు పనిచేశారని, ఇది పూర్తిగా ఎన్నికల నిబంధనల ఉల్లంఘన కిందకే వస్తుందని ఆయన తెలిపారు.ఎన్నికలను దృష్టిలో ఉంచుకునే కొద్దిరోజుల క్రితం మోడీపై సినిమా ప్రారంభించడం, ఎన్నికలకు వారం రోజుల ముందు విడుదలకు సిద్ధం చేయడంపై ఈసీకి ఫిర్యాదు చేసినట్టు కపిల్ సిబాల్ తెలిపారు.ఈసీని కలిసిన ప్రతినిధి బృందంలో కాంగ్రెస్ సీనియర్ నేతలు రణ్‌దీప్ సింగ్ సూర్జేవాలా, కపిల్ సిబల్, అభిషేక్ మను సింఘ్వి ఉన్నారు.