Pushpa Song : యూపీ రాజకీయాల్లో పుష్ప సాంగ్.. శ్రీవల్లి పాటను రీమిక్స్ చేసిన కాంగ్రెస్
చూపే బంగారమాయేనే శ్రీవల్లి.. పాట మ్యూజిక్‌తో తూ హై గజాబ్ యూ, యూపీ తేరీ కసమ్ యూపీ అంటూ వీడియో సాంగ్‌ను రూపొందించింది.

Pushpa (1)
Congress remixed Pushpa song : ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ నటించిన బ్లాక్‌బస్టర్ పుష్ప క్రేజ్ ఇప్పుడప్పుడే తగ్గేలా లేదు. సినీ అభిమానులతో పాటు స్టార్ క్రికెటర్లు, ప్రముఖులు ఇందులోని పాటలు, డైలాగ్‌లను అనుకరిస్తూ సోషల్‌మీడియాలో హల్‌చల్ చేస్తున్నారు. ఇప్పుడు రాజకీయాల్లోకీ పుష్ప ఫీవర్ పాకింది. తాజాగా ఉత్తర్‌ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల కోసం కాంగ్రెస్ ఎన్నికల సాంగ్‌ను విడుదల చేసింది. పుష్ప సినిమాలోని శ్రీవల్లి పాటను రీమేక్స్ చేసి యూపీ గొప్పతనాన్ని చెబుతూ ఈ పాటను రూపొందించింది.
చూపే బంగారమాయేనే శ్రీవల్లి.. పాట మ్యూజిక్‌తో తూ హై గజాబ్ యూ, యూపీ తేరీ కసమ్ యూపీ అంటూ వీడియో సాంగ్‌ను రూపొందించింది. రాణీ లక్ష్మీబాయి వంటి గొప్ప వ్యక్తులు పోరాడిన నేల అంటూ.. రాష్ట్రం గొప్పతనాన్ని వివరిస్తూ రాసిన ఈ పాట ఆకట్టుకునేలా ఉంది. ఈ వీడియో సాంగ్‌ను యూపీ కాంగ్రెస్ తమ ట్విటర్ ఖాతాలో షేర్ చేస్తూ.. ఉత్తరప్రదేశ్ వాసులం అయినందుకు గర్వంగా ఉందని పోస్ట్ చేశారు.
Ministers Committee : సమ్మెకు వెళ్లొద్దని కోరిన మంత్రుల కమిటీ.. ఉద్యోగుల ముందు కీలక ప్రతిపాదనలు
ఎన్నికల సమయంలో ఓట్ల కోసం రాజకీయ పార్టీలు పడే పాట్లు అంతా ఇంతా కాదు. ఓటర్లను ఆకర్షించేందుకు ఎప్పటికప్పుడు వినూత్న ప్రయత్నాలకు శ్రీకారం చుడుతుంటారు. మొన్నటికి మొన్న పంజాబ్‌లో ముఖ్యమంత్రి అభ్యర్థిని ప్రకటిస్తూ ఆమ్ ఆద్మీ పార్టీ ఓ ప్రత్యేక వీడియోను రూపొందించింది. 2007లో విడుదలైన హిందీ మల్టీస్టారర్ హే బేబీ సినిమాలోని మస్త్ కలందర్ పాటను ఫొటో ఎడిట్ చేసి రూపొందించిన ఆ వీడియో నెట్టింట్లో తెగ వైరల్ అయ్యింది.