Amritsar : ఎన్నికల చరిత్రలో సరికొత్త ఘట్టం, ఓటు వేసిన అవిభక్త కవలలు

వారిద్దరికీ వ్యక్తిగత ఓటు హక్కును కల్పించింది. పంజాబ్ చీఫ్ ఎలక్టోరల్ ఆఫీసర్ వారికి రెండు వేర్వేరు ఎలక్టోరల్ ఫోటో గుర్తింపు కార్డులను అందజేశారు. ఇద్దరు వేర్వేరు ఓటర్ల మధ్య గోప్యత...

Amritsar : ఎన్నికల చరిత్రలో సరికొత్త ఘట్టం, ఓటు వేసిన అవిభక్త కవలలు

Punjab Voting

Updated On : February 20, 2022 / 9:43 PM IST

Conjoined Twins Cast Their Votes : భారత ఎన్నికల చరిత్రలో సరికొత్త ఘట్టం ఆవిష్కృతమైంది. పంజాబ్‌ అసెంబ్లీ ఎన్నికల్లో తొలిసారిగా అవిభక్త కవలలు ఓటు హక్కు వినియోగించుకున్నారు. పంజాబ్‌లో అసెంబ్లీ ఎన్నికల పోలింగ్‌లో అవిభక్త కవలలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. అవిభక్త కవలలైన సోహ్నా సింగ్‌, మోహ్నా సింగ్‌.. అమృత్‌సర్‌లోని మనావాలాలో తొలిసారిగా తమ ఓటుహక్కు వినియోగించుకున్నారు. ఒకే శరీరంతో ఉన్న ఈ సోదరులకు ఎన్నికల కమిషన్‌ వేర్వేరుగా ఓటుహక్కు కల్పించింది. గత నెలలో ఎన్నికల సంఘం.. సోహ్నా, మోహ్నాలను వేర్వేరు ఓటర్లుగా పరిగణించింది.

Read More : Five States Election 2022 : యూపీలో 11 గంటల వరకు 21.18, పంజాబ్‌‌లో 17.77 శాతం ఓటింగ్

వారిద్దరికీ వ్యక్తిగత ఓటు హక్కును కల్పించింది. పంజాబ్ చీఫ్ ఎలక్టోరల్ ఆఫీసర్ వారికి రెండు వేర్వేరు ఎలక్టోరల్ ఫోటో గుర్తింపు కార్డులను అందజేశారు. ఇద్దరు వేర్వేరు ఓటర్ల మధ్య గోప్యత పాటించేందుకు పోలింగ్ బూత్ వద్ద ప్రత్యేక ఏర్పాట్లు చేశారు ఎన్నికల అధికారులు. ఒకరి ఓటు మరొకరికి కనిపించకుండా వారిద్దరికీ నల్ల కళ్లద్దాలు ఇచ్చారు. అవిభక్త కవలల ఓటింగ్‌ను ప్రత్యేకంగా తీసుకున్న అధికారులు.. ఈసీ ఆదేశాల ప్రకారం.. ఓటు వేసే సమయంలో.. వీడియోగ్రఫీ తీశారు. 2003 జూన్‌లో ఢిల్లీలో జన్మించిన సోహ్నా, మోహ్నాలను తల్లిదండ్రులు వదిలేశారు. వారిని అమృత్‌సర్‌లోని ఓ అనాథ శరణాలయం దత్తత తీసుకుంది. సోహ్నా, మోహ్నా ఇద్దరికి 18 సంవత్సరాలు నిండాయి. ఈ అవిభక్త కవలలు ఇద్దరూ ఇటీవల పంజాబ్ స్టేట్ పవర్ కార్పొరేషన్ లిమిటెడ్‌లో ఉద్యోగం సంపాదించి గతంలోనూ వార్తల్లో నిలిచారు.