Five States Election 2022 : యూపీలో 11 గంటల వరకు 21.18, పంజాబ్‌‌లో 17.77 శాతం ఓటింగ్

ఐదు రాష్ట్రాల ఎన్నికల్లో భాగంగా యూపీలో మూడో దశ, పంజాబ్ లో పోలింగ్ కొనసాగుతోంది...యూపీలో ఉదయం 11 గంటల వరకు 21.18 శాతం, పంజాబ్ రాష్ట్రంలో 17.77 శాతం ఓటింగ్ నమోదైంది....

Five States Election 2022 : యూపీలో 11 గంటల వరకు 21.18, పంజాబ్‌‌లో 17.77 శాతం ఓటింగ్

Election Update Today

UP And Punjab Polling : ఐదు రాష్ట్రాల ఎన్నికల్లో భాగంగా యూపీలో మూడో దశ, పంజాబ్ లో పోలింగ్ కొనసాగుతోంది. 2022, ఫిబ్రవరి 20వ తేదీ ఆదివారం ఉదయం 7 గంటలకు యూపీలో, 8 గంటలకు పంజాబ్ లో ఎన్నికల పోలింగ్ స్టార్ట్ అయ్యింది. ఓట్లు వేసేందుకు ప్రజలు ఆసక్తి చూపిస్తున్నారు. దీంతో క్యూ లైన లో ఓటర్లు బారులు తీరి నిలబడడం కనిపిస్తోంది. యూపీలో ఉదయం 11 గంటల వరకు 21.18 శాతం ఓటింగ్ నమోదైంది. ఒకే దశలో ఓటింగ్ జరుగుతున్న పంజాబ్ రాష్ట్రంలో ఉదయం 11 గంటల వరకు 17.77 శాతం ఓటింగ్ నమోదైంది.

Read More : Five States Elections 2022 : మోగిన ఐదు రాష్ట్రాల ఎన్నికల నగారా.. ముఖ్య తేదీలు ఇవే

యూపీలో మూడో విడత పోలింగ్ సందర్భంగా ఎలక్ట్రానిక్ ఓటింగ్ మెషిన్ లో తేడాలున్నాయని సమాజ్ వాదీ పార్టీ ఆరోపించడం హాట్ టాపిక్ అయ్యింది. ఓటు వేసినప్పుడు కూడా ఓటర్ వెరిఫైబుల్ పేపర్ అడిట్ ట్రయల్ (VVPAT) బీజేపీకి సంబంధించిన స్లిప్ జారీ చేసిందని ఆరోపించింది. ఈ ఆరోపణలు నిరాధారమని ఎన్నికల సంఘం పేర్కొంది. యూపీలో జరుగుతున్న ఓటింగ్‌లో మాజీ ముఖ్యమంత్రులు భవిష్యత్ పరీక్షించుకోబోతున్నారు. ఉత్తరప్రదేశ్‌లో 16 జిల్లాల్లో 59 అసెంబ్లీ నియోజకవర్గాలకు పోలింగ్ జరుగుతోంది. సాయంత్రం 6 గంటల వరకు ఓటు వేసేందుకు అవకాశం కల్పించింది ఈసీ. రెండు కోట్ల 15 లక్షల మంది ఓటు హక్కు వినియోగించుకోనున్నారు. 627 మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు. పోలింగ్ జరుగుతున్న వాటిలో కర్హాల్ నియోజకవర్గం కూడా ఉంది. ఆ నియోజకవర్గం నుంచి అఖిలేశ్ యాదవ్ పోటీ చేస్తున్నారు. పోలింగ్ జరుగుతున్న 59 నియోజకవర్గాల్లో 2017లో బీజేపీ 49 సీట్లు గెలుచుకుంది. ఎస్పీ 9 సీట్లకే పరిమితమైంది. కాంగ్రెస్ ఒకటి గెలుకుంది.

Read More : UP Assembly Elections: ఉత్తరప్రదేశ్ లో ప్రారంభమైన మూడో దశ పోలింగ్

ఇక పంజాబ్ విషయానికి వస్తే ఇక్కడ కాంగ్రెస్ అధికారంలో ఉన్న సంగతి తెలిసిందే. పంజాబ్‌లో మొత్తం 117 అసెంబ్లీ నియోజకవర్గాలకు పోలింగ్ కొనసాగుతోంది. 8 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు ఓటింగ్‌కు అనుమతి ఉంది. మొత్తం 13 వందల నాలుగు మంది బరిలో ఉన్నారు. ఇందులో 93 మంది మహిళా అభ్యర్థులు ఉన్నారు. రెండు కోట్ల మంది ఓటర్లు ఓటు హక్కు వినియోగించుకోనున్నారు. పంజాబ్‌లో ఇద్దరు మాజీ ముఖ్యమంత్రులు ప్రశాశ్‌ సింగ్ బాదల్, కెప్టెన్ అమరీందర్ సింగ్ భవితవ్యం ఈవీఎంలో నిక్షిప్తం కానుంది. మరోవైపు చరణ్‌జీత్ సింగ్ చన్నీ, సిద్ధూ, ఒక ఆప్ సీఎం అభ్యర్థి భగవంత్ మాన్‌ బరిలో ఉన్నారు. పంజాబ్‌లో అధికారం కోసం అన్ని పార్టీలు పోటీపడుతున్నాయి. ఓటర్లను ఆకర్షించేందుకు వరాల జల్లు కురిపించాయి.