తల్లిప్రేమను చాటిన శునకం :  మేకపిల్లకు తల్లిగా..

తల్లి దగ్గర నుండి చెదిరిపోయిన ఓ బుజ్జి మేకపిల్లకు ఓ కుక్క తల్లిగా మారింది. ఆ బుజ్జి మేకపిల్లకు తన పిల్లలతో పాటు పాలిచ్చి పెంచుతోంది.

  • Published By: veegamteam ,Published On : December 31, 2018 / 11:56 AM IST
తల్లిప్రేమను చాటిన శునకం :  మేకపిల్లకు తల్లిగా..

Updated On : December 31, 2018 / 11:56 AM IST

తల్లి దగ్గర నుండి చెదిరిపోయిన ఓ బుజ్జి మేకపిల్లకు ఓ కుక్క తల్లిగా మారింది. ఆ బుజ్జి మేకపిల్లకు తన పిల్లలతో పాటు పాలిచ్చి పెంచుతోంది.

పుదుక్కోటి : ప్రకృతి కన్నెర్ర చేస్తే ఎంతటి ఘనమైనదైనా నేల కూలిపోవాల్సిందే. కానీ ప్రకృతి చేసిన విలతాండవానికి బ్రతులుకు చెదిరిపోయినా..తిరిగి జీవితాన్ని నిలబెట్టుకుంటాడు మనిషి. ఇలా ఎప్పుడు తనను తాను నిలబెట్టుకుంటు..తిరిగి తన జీవనాన్ని పునర్నించుకుంటుంటాడు. చెదిరిపోయి కానరాని తీరాలకు కొట్టుకుపోయినా..తిరిగి కొంతకాలానికైనా తనవారిని చేరుకుంటాడు. కానీ గజ తుఫాను ధాటికి అల్లాడిపోయిన తమిళనాడులో పశు పక్ష్యాదులు కూడా చెల్లా చెదురైపోయాయి. అలా తల్లి దగ్గర నుండి చెదిరిపోయిన ఓ బుజ్జి మేకపిల్లకు ఓ కుక్క తల్లిగా మారింది. ఆ బుజ్జి మేకపిల్లకు తన పిల్లలతో పాటు పాలిచ్చి పెంచుతోంది. జాతి వేరైనా..తల్లి ప్రేమకు నిదర్శనంగా నిలిచిన ఈ వీడియో ఇప్పుడు వైరల్ గా మారింది. తల్లి జాడ మాత్రం దొరకలేదు. ఆకలితో అలమటిస్తున్న ఆ బుజ్జి మేకపిల్లను చూసిన  ఓ శునకం జాలి పడింది. మేక ఆకలి బాధను చూడలేక పాలిచ్చి అక్కున చేర్చుకుంది. తమిళనాడులోని పుదుక్కోటిలో ఈ ఘటన చోటు చేసుకోగా.. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
A dog that is grown up in the goat