Vadodara: గుజరాత్ యూనివర్సిటీలో నమాజ్ వివాదం.. కుట్ర దాగుందన్న వీహెచ్‌పీ
సోషల్ మీడియాలో విడుదలైన వీడియో ప్రకారం.. వడోదరలోని మహారాజా సాయాజీరావు విశ్వవిద్యాలయం క్యాంపస్‌లోని జనరల్ ఎడ్యుకేషన్ బిల్డింగ్ సమీపంలో సోమవారం ఉదయం ఇద్దరు విద్యార్థులు నమాజ్ చేస్తూ కనిపించారు. అయితే దీనిపై వీహెచ్‌పీ సహా హిందూ సంఘాలు అభ్యంతరం తెలపడంతో వివాదం రాజుకుంది. సంఘటన గురించి తెలుసుకున్న వర్సిటీ విజిలెన్స్ బృందం సంఘటనా స్థలానికి చేరుకుంది

Controversy over offering Namaz in Gujarat University
Vadodara: గుజరాత్ రాష్ట్రంలోని ఒక యూనివర్సిటీలో ఇద్దరు విద్యార్థులు నమాజ్ చేయడంపై వివాదం చెలరేగింది. వర్సిటీ క్యాంపస్‌లో నమాజ్ చేయడం వెనుక కుట్ర ఉందని ఆరోపిస్తూ విశ్వహిందూ పరిషత్ ఆరోపణలు చేసింది. సదరు విద్యార్థులు నమాజ్ చేసిన ప్రాంతంలో గంగాజలాన్ని చల్లుతూ ‘రామ్ ధున్’ నిర్వహించారు. అలాగే హిందూ కార్యకర్తలు మహావిద్యాలయం వెలుపల హనుమాన్ చాలీసా పఠించారు.
సోషల్ మీడియాలో విడుదలైన వీడియో ప్రకారం.. వడోదరలోని మహారాజా సాయాజీరావు విశ్వవిద్యాలయం క్యాంపస్‌లోని జనరల్ ఎడ్యుకేషన్ బిల్డింగ్ సమీపంలో సోమవారం ఉదయం ఇద్దరు విద్యార్థులు నమాజ్ చేస్తూ కనిపించారు. అయితే దీనిపై వీహెచ్‌పీ సహా హిందూ సంఘాలు అభ్యంతరం తెలపడంతో వివాదం రాజుకుంది. సంఘటన గురించి తెలుసుకున్న వర్సిటీ విజిలెన్స్ బృందం సంఘటనా స్థలానికి చేరుకుంది. యూనివర్సిటీ భవనంలో పరీక్షలు జరుగుతున్నందున శాంతిభద్రతల పరిరక్షణ కోసం పోలీసులను పిలిపించినట్లు ఎంఎస్ విశ్వవిద్యాలయం పబ్లిక్ రిలేషన్స్ ఆఫీసర్ లకులీష్ త్రివేది తెలిపారు.
Fire In Parawada Pharma City : అనకాపల్లి జిల్లా పరవాడలో ఘోర అగ్నిప్రమాదం.. ఐదుగురు మృతి
భవిష్యత్తులో ఇలాంటి ప్రార్థనలు జరగకుండా విద్యార్థులకు కౌన్సెలింగ్ ఇస్తామని యూనివర్సిటీ యాజమాన్యం స్పందిస్తూ ప్రకటించింది. ఇద్దరూ డిగ్రీ (బీకాం) ద్వితీయ సంవత్సరం చదువుతున్న విద్యార్థులు పరీక్షల రాయడానికి వచ్చి భవనం లోపలికి వెళ్లే ముందు నమాజ్ చేశారు.