ఇండియాలో కరోనా @ 10వేలు

  • Published By: madhu ,Published On : April 14, 2020 / 01:05 AM IST
ఇండియాలో కరోనా @ 10వేలు

Updated On : April 14, 2020 / 1:05 AM IST

భారతదేశాన్ని కరోనా రాకాసి వదిలిపెట్టడం లేదు. ఈ వైరస్ వల్ల వందలాది మంది బలవుతున్నారు. కేంద్ర ప్రభుత్వం పకడ్బంది చర్యలు తీసుకుంటున్నా..కేసుల సంఖ్య ఏ మాత్రం తగ్గడం లేదు.  ఈ వైరస్ బారిన పడి వారి సంఖ్య 10 వేలకు చేరుకొంటోంది.

మహరాష్ట్రలో 22 మంది చనిపోయారు. మొత్తం మృతుల సంఖ్య 324కి చేరుకుంది. ఢిల్లీలో 5, గుజరాత్ 3, వెస్ట్ బెంగాల్ 2, తమిళనాడు 1, జార్ఖండ్ 1, ఏపీలో ఒకరు చనిపోయారు. కొత్తగా 796 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. దేశంలో కరోనా యాక్టివ్ కేసులు 7 వేల 987 కాగా, 856 మంది చికిత్సతో పూర్తిగా కోలుకున్నారు. కరోనా సోకిన వారిలో 72 మంది విదేశీయులు సైతం ఉన్నారు. 

దేశంలో మహరాష్ట్రలో అత్యధికంగా కేసులు నమోదవుతున్నాయి. ఫస్ట్ ప్లేస్ లో నిలుస్తోంది. ఇప్పటిదాక 149 చనిపోవడంతో అక్కడ ఎలాంటి పరిస్థితి ఉందో అర్థం చేసుకోవచ్చు. మధ్యప్రదేశ్‌లో 36 మంది, గుజరాత్‌లో 25 మంది, ఢిల్లీలో 24 మంది, పంజాబ్‌లో 11 మంది, తమిళనాడులో 11 మంది, పశ్చిమబెంగాల్‌లో 8 మంది తుదిశ్వాస విడిచారు. 

Also Read | చెక్ చేసుకోండి : తెల్లరేషన్ కార్డు దారుల బ్యాంకు అకౌంట్లో రూ. 1500