భారత్‌లో కరోనా విజృంభణ…5,865 పాజిటివ్ కేసులు..169 మంది మృతి
భారత్‌లో కరోనా విజృంభిస్తోంది. నిజాముద్దీన్ ఎఫెక్ట్‌తో భారత్‌లో కరోనా పాజిటివ్ కేసులు పెరుగుతున్నాయి. దేశంలో ఇప్పటివరకు 5 వేల 865 కరోనా కేసులు నమోదయ్యాయి.

భారత్‌లో కరోనా విజృంభిస్తోంది. నిజాముద్దీన్ ఎఫెక్ట్‌తో భారత్‌లో కరోనా పాజిటివ్ కేసులు పెరుగుతున్నాయి. దేశంలో ఇప్పటివరకు 5 వేల 865 కరోనా కేసులు నమోదయ్యాయి.
భారత్‌లో కరోనా విజృంభిస్తోంది. నిజాముద్దీన్ ఎఫెక్ట్‌తో భారత్‌లో కరోనా పాజిటివ్ కేసులు పెరుగుతున్నాయి. దేశంలో ఇప్పటివరకు 5 వేల 865 కరోనా కేసులు నమోదయ్యాయి. గత 24 గంట్లలో కొత్తగా 549 కేసులు నమోదయ్యాయి. 5 వేల 218 మందికి చికిత్స కొనసాగుతోంది. 477 మంది డిశ్చార్జ్ అయ్యారు. గత 24 గంటల్లో 24 మంది కరోనాతో మృతి చెందారు. మొత్తం మృతుల సంఖ్య 169 మందికి చేరింది. దేశంలో ఇప్పటివరకు లక్షా 30 వేల శాంపిల్స్‌ను టెస్టు చేసినట్లు ఇండియన్ మెడికల్ రీసెర్చి కౌన్సిల్ తెలిపింది. మొత్తంగా ఇప్పటివరకు దేశంలో 5 వేల 734 శాంపిల్స్‌కు మాత్రమే పాజిటివ్ వచ్చింది.
తబ్లిగి జమాత్ దెబ్బకు తమిళనాడు తలకిందులు అవుతుంది. రోజురోజుకు రాష్ట్రంలో కరోనా కేసులు పెరుగుతున్నాయి. తమిళనాడులో ఇప్పటివరకు 738 కేసులు నమోదయ్యాయి. 8 మంది కరోనాకు బలయ్యారు. 21 మంది కరోనా నుంచి కోలుకుని ఆస్పత్రుల నుంచి డిశ్చార్జి అయ్యారు. అయితే తమిళనాడులో తాజాగా 96 కేసులు నమోదయినట్టు అధికారులు చెబుతున్నారు. వీరిలో 80 మందికి నిజాముద్దీన్ లింక్ ఉందన్నారు.
లాక్‌డౌన్ నేపథ్యంలో రేషన్‌కార్డు కలిగిన ప్రతి కుటుంబానికీ 17 రకాల సరకులతో కూడిన ఆహార కిట్ల పంపిణీకి కేరళ ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. మొత్తం వెయ్యి రూపాయలు విలువ చేసే వస్తువులను ఈ కిట్లలో భాగంగా అందిస్తున్నారు. కేజీ పంచధార, 250 గ్రాముల టీ పొడి, కేజీ ఉప్పు, సెనగలు, అర లీటర్ వంట నూనె, రెండు కేజీల గోధుమ పిండి, కేజీ రవ్వ, సబ్బులు మొదలైన 17 వస్తువులతో కూడిన కిట్లను రేషన్ కార్డుదారులకు ఉచితంగా పంపిణీ చేశారు. ఉచిత ఆహార కిట్ల పంపిణీకి రూ.350 కోట్లు కేటాయిస్తున్నట్లు కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్ వెల్లడించారు.
Also Read | ఏపీని టెన్షన్ పెడుతోన్న కరోనా…24 గంటల్లో 19 పాజిటివ్ కేసులు