భారత్‌లో కరోనా : పెరుగుతున్న కేసులు..వీసాలు రద్దు..హెల్ప్ లైన్ నెంబర్

భారత్‌లో కరోనా వైరస్ రెక్కలు చాస్తోంది. రోజురోజుకు విస్తరిస్తోంది. మన దేశంలో ప్రవేశించిన ఈ ప్రాణాంతక వైరస్ అనతి కాలంలోనే పంజా విసురుతోంది. తాజాగా నోయిడాకు చెందిన మరో వ్యక్తికి కరోనా పాజిటివ్ అని తేలింది. దీంతో దేశంలో కరోనా కేసుల సంఖ్య 73కి చేరింది. ఇందులో 56మంది భారతీయులుండగా.. 17మంది విదేశీయులున్నారు. దీంతో కేంద్ర ప్రభుత్వం మరింత అప్రమత్తమైంది. ఇప్పటికే ఏప్రిల్ 15 వరకు టూరిస్టు వీసాలను రద్దు చేసిన ప్రభుత్వం… తాజాగా హెల్ప్‌లైన్ నెంబర్‌ను ప్రకటించింది.(ఖమ్మంలో మెడిసిన్ విద్యార్థికి కరోనా లక్షణాలు)
నోయిడాకు చెందిన ఓ వ్యక్తి టూరిస్ట్ గైడ్‌గా పనిచేస్తున్నారు. ఇటీవల ఆయన… ఆగ్రా, జైపూర్ నగరాల్లో పర్యటించిన ఇటలీ బృందానికి సేవలదించారు. దీంతో అతడికి కూడా కరోనా సోకినట్లు వైద్యులు తేల్చారు. ప్రస్తుతం అతడిని ఢిల్లీ ఆసుపత్రిలో ఉంచి చికిత్స అందిస్తున్నారు. మరోవైపు… అతడి కుటుంబ సభ్యుల నుంచి రక్త నమూనాలను కూడా సేకరించిన వైద్యులు… పరీక్షల కోసం పుణె ల్యాబ్‌కు పంపారు.
ఇప్పటి వరకు కేరళలో కేరళలో 17 కేసులు, హర్యానాలో 14, మహారాష్ట్రలో 11, యూపీలో 9, ఢిల్లీలో 5, కర్ణాటకలో 4, రాజస్థాన్ లో 3, లఢఖ్ లో 2 కేసులు వెలుగుచూశాయి. దీంతోపాటు తెలంగాణ, పంజాబ్, జమ్మూకశ్మీర్, తమిళనాడులలో ఒక్కో కేసు నమోదయ్యాయి.
Read More : గుడ్ న్యూస్ : లాభాల్లో తెలంగాణ ఆర్టీసీ