గుంటూరు మిర్చిపై కరోనా తీవ్ర ప్రభావం : చైనాకు నిలిచిపోయిన ఎగుమతులు 

చైనాలో ప్రబలిన ప్రాణాంతక కరోనా వైరస్‌ గుంటూరు మిర్చి ఎగుమతులపై తీవ్ర ప్రభావం చూపింది. ఆ దేశానికి ఎగుమతులు నిలిచిపోవడంతో రైతులు కుదేలయ్యారు.

  • Published By: veegamteam ,Published On : February 4, 2020 / 02:12 PM IST
గుంటూరు మిర్చిపై కరోనా తీవ్ర ప్రభావం : చైనాకు నిలిచిపోయిన ఎగుమతులు 

Updated On : February 4, 2020 / 2:12 PM IST

చైనాలో ప్రబలిన ప్రాణాంతక కరోనా వైరస్‌ గుంటూరు మిర్చి ఎగుమతులపై తీవ్ర ప్రభావం చూపింది. ఆ దేశానికి ఎగుమతులు నిలిచిపోవడంతో రైతులు కుదేలయ్యారు.

చైనాలో ప్రబలిన ప్రాణాంతక కరోనా వైరస్‌ గుంటూరు మిర్చి ఎగుమతులపై తీవ్ర ప్రభావం చూపింది. ఆ దేశానికి ఎగుమతులు నిలిచిపోవడంతో రైతులు కుదేలయ్యారు. ధరలు పాతాళానికి పడిపోవడంతో పీకల్లోతు కష్టాల్లో కూరుకుపోయారు. చైనాకు ఎగుమతులు జరిగినంత వరకు క్వింటాలు మిర్చి 20 వేల రూపాయలు పలికేంది. ఇప్పుడు  పది వేల నుంచి పదమూడు వేల రూపాయల  రేటు కూడా రావడంలేదు. కరోనా వైరస్‌ తగ్గి చైనాకు ఎగుమతుల పునరుద్ధరణ జరిగే వరకు మిర్చి మార్కెట్‌లో అనిశ్చితి తప్పదని అంచనా వేస్తున్నారు. 

గుంటూరు మిర్చి మార్కెట్‌ యార్డ్‌ నుంచి చైనాకు భారీగా ఎగుమతులు 
గుంటూరు మిర్చి మార్కెట్‌ యార్డ్‌ నుంచి చైనాకు భారీగా ఎగుమతులు జరుగుతాయి. శ్రీలంకతోపాటు ఐరోపా, అమెరికాకు ఎక్స్‌పోర్ట్స్‌ ఉంటాయి. అయితే ఐరోపా, యూఎస్‌ మార్కెట్లు ఇంకా ప్రారంభకాలేదు. దీంతో ఇప్పటి వరకు ప్రధానంగా చైనాకు జరిగిన ఎగుమతులు కరోనా ప్రభావంతో నిలిచిపోయాయి. రైతులు యార్డ్‌కు మిర్చి తీసుకొచ్చినా.. స్వదేశీ మార్కెట్ ఆధారంగానే కొనుగోళ్లు జరుగుతున్నాయి. దీంతో రేట్లు రావడంలేదని రైతుల ఆందోళన చెందుతున్నారు. 
 
ధర లేకపోవడంతో మిర్చి రైతులకు తీవ్ర నష్టం 
ధర లేకపోవడంతో మిర్చి రైతులు తీవ్రంగా నష్టపోతున్నారు. పెట్టుబడి ఖర్చుల కూడా రావడంలేదని ఆందోళన చెందుతున్నారు. పంట కోసం లక్ష రూపాయల వరకు పెట్టుబడి పెట్టిన రైతులు.. ఇప్పుడు పాతాళానికి పడిపోయిన ధరలు చూసి దిగాలు పడుతున్నారు. మంచి ధర ఉన్న సయమంలో కరోనా వైరస్‌ తమను కష్టాలపాలు చేసిందన్న ఆవేదన మిర్చి రైతుల్లో కనిపిస్తోంది. 

మార్కెట్‌లో ధరల అనిశ్చితి
మిర్చి మార్కెట్‌లో ధరలు పడిపోయిన సమయంలో తమను ఆదుకోవాల్సిన బాధ్యత ప్రభుత్వంపైనే ఉందని రైతులు చెబుతున్నారు. మద్దుతు ధర ఇప్పించాంటున్నారు. మార్క్‌ఫెడ్‌ ద్వారా మద్దతు ధరకు మిర్చి కొనుగోలు చేయిస్తే బాగుంటుందని రైతులు సూచిస్తున్నారు. ధరలు మరింత పతనం కాకముందే ప్రభుత్వం జోక్యం చేసుకోవాలంటున్నారు. గుంటూరు మిర్చి యార్డ్‌కు నుంచి చైనాకు ఎగుమతులు నిలిచిపోవడంతో కొనుగోళ్లు తగ్గించినట్టు వ్యాపారులు చెబుతున్నారు. కరోనా వైరస్‌ తగ్గేవరకు మార్కెట్‌లో ధరల అనిశ్చితి తప్పదంటున్నారు.