ఒంటరిగా కూర్చుని భోజనం చేయటం అలవాటు చేసుకోండి..

  • Published By: nagamani ,Published On : June 10, 2020 / 10:12 AM IST
ఒంటరిగా కూర్చుని భోజనం చేయటం అలవాటు చేసుకోండి..

Updated On : June 10, 2020 / 10:12 AM IST

కరోనాకు ముందు కరోనాకు తరువాత అనేలా ఉన్నాయి నేటి పరిస్థితులు. అందరూ కలిసి..మెలిసి భోజనం చేయటంలో చాలా సంతోషముంటుంది.అది గతకాలపు సంప్రదాయం కూడా. కానీ..ఈ కరోనా కాలంలో కలిసి మెలిసి వద్దు..ఒంటరిగా ఉండటమే ముద్దు అన్నట్లుగా ఉంది  పరిస్థితి. మనుషులు దూరం దూరంగా ఉండండి..లేదంటే నేనున్నా..అంటోంది కరోనా..సంప్రదాయాలకు కూడా కాలం చెల్లిదంటోంది కరోనా. ఇద్దరు ముగ్గురు కలిసి కూర్చుని భోజనం చేయద్దంటున్నారు నిపుణులు .దీని వల్ల కరోనా వ్యాపించే అవకాశముందంటున్నారు. 

సాధారణంగా ఆఫీసుల్లో కొలీగ్స్ కలిసి కూర్చుని భోజనం చేయటానికి ఎక్కువగా ఇష్టపడుతుంటారు. ఏదో పిచ్చాపాటి మాట్లాడుకుంటూ ఒకరి విషయాలు మరొకరు షేర్ చేసుకుంటూ లంచ్ చేయటం సర్వసాధారణం. కానీ ఈ కరోనా కాలంలోఅలా ఎక్కువ మంది ఒకే దగ్గర కూర్చుని భోజనం చేయవద్దని ఢిల్లీలోని ఎయిమ్స్ డైరక్టర్ రణ్‌దీప్ గులేరియా తెలిపారు. 

అలా కొంతకాలంపాటు తప్పదనీ..ఒంటరిగా భోజనం చేయడం అలవాటు చేసుకోవాలని సూచించారు. ఆఫీసుల్లో  ఉద్యోగుల మధ్య భౌతిక దూరం తప్పనిసరిగా ఉండాలనీ..పరిశుభ్రత..శానిటైజేషన్ క్రమం తప్పకుండా ఉండాలన్నారు.

దేశంలో కరోనా వ్యాప్తి ఒక్కో ప్రాంతంలో ఒక్కోలా ఉంటోందనీ..ముంబై, ఢిల్లీలో పరిస్థితి భిన్నంగా ఉందనీ..ఒక్కో ప్రాంతంలో ఒక్కో తరహాలో కరోనా వైరస్ వ్యాప్తి ఉందని తెలిపారు. 

ముఖ్యంగా కంటైన్‌మెంట్ జోన్లలో ప్రజలు మరింత అప్రమత్తంగా ఉండాలని..ఏమాత్రం నిర్లక్ష్యం వహించినా కరోనా కాచుకుని కూర్చుంటుందని దాని  ఫలితం తప్పదని హెచ్చరించారు. మాస్కులు పెట్టుకోవడంతో పాటు తప్పనిసరిగా సామాజిక దూరం పాటించాలని గులేరియా సూచించారు. 

Read: ఇద్దరు అధికారులతో సహా 14మంది జైలు సిబ్బందికి క‌రోనా..