కేరళలో మరో కరోనా కేసు నమోదు

చైనాను వణికిస్తోన్న కరోనా ఇప్పుడు భారత్‌లోకి ప్రవేశించింది. కేరళను కరోనా వైరస్ భయపెడుతోంది. రాష్ట్రంలో మరో కరోనా వైరస్ కేసు నమోదు అయింది.

  • Published By: veegamteam ,Published On : January 31, 2020 / 02:55 AM IST
కేరళలో మరో కరోనా కేసు నమోదు

Updated On : January 31, 2020 / 2:55 AM IST

చైనాను వణికిస్తోన్న కరోనా ఇప్పుడు భారత్‌లోకి ప్రవేశించింది. కేరళను కరోనా వైరస్ భయపెడుతోంది. రాష్ట్రంలో మరో కరోనా వైరస్ కేసు నమోదు అయింది.

చైనాను వణికిస్తోన్న కరోనా ఇప్పుడు భారత్‌లోకి ప్రవేశించింది. కేరళను కరోనా వైరస్ భయపెడుతోంది. రాష్ట్రంలో మరో కరోనా వైరస్ కేసు నమోదు అయింది. కేరళలో మరో వ్యక్తికి కరోనా వైరస్ లక్షణాలు ఉన్నట్లు గుర్తించారు. కరోనా లక్షణాలతో ఓ వ్యక్తి త్రిస్సూర్ జనరల్ ఆస్పత్రిలో చేరారు. నిన్న రాష్ట్రంలో తొలి కేసు నమోదైంది. చైనా నుంచి వచ్చిన వ్యక్తికి ఈ వ్యాధి సోకినట్లు కేంద్ర ఆరోగ్య శాఖ ధృవీకరించింది. 

కరోనా వైరస్ సోకినట్లు భావిస్తున్న 15 మందిపై రాష్ట్ర ప్రభుత్వం నిఘా ఉంచింది. 9 మందిని ఐసోలేషన్ సెంటర్లలో ఉంచి చికిత్స అందిస్తున్నారు. మిగిలిన వారికి వైద్యులు ఇంటి వద్దే చికిత్స అందజేస్తున్నారు. మరో కరోనా వైరస్ కేసు నమోదుతో కేరళ ప్రభుత్వం అప్రమత్తమైంది. 

త్రిస్సూర్ మెడికల్ కాలేజీలో కేరళ ఆరోగ్యశాఖ మంత్రి శైలజ ఉన్నతస్థాయి సమీక్ష నిర్వహించారు. కరోనా వైరస్ సోకిన మహిళ ఆరోగ్యం నిలకడగా ఉందని కేరళ మంత్రి తెలిపారు. కరోనా వైరస్ సోకిన మహిళను త్రిస్సూర్ మెడికల్ కాలేజీ నుంచి జనరల్ ఆస్పత్రికి తరలిస్తామని తెలిపిన కేరళ మంత్రి శైలజ తెలిపారు. 

కేరళ రాష్ట్రంలో కరోనా వైరస్ అనుమానాలతో 400మందికి పైగా వ్యక్తులను ఇళ్లలోనే ఉంచారు. డాక్టర్ల పర్యవేక్షణలో వారంతా ఉన్నారు. ఇక ఢిల్లీ, ముంబై నగరాల్లోని ఆసుపత్రుల్లో ఐసోలేషన్ వార్డుల్లో ప్రత్యేకంగా పర్యవేక్షిస్తున్నారు. 

కరోనా తీవ్రతను గుర్తించిన ప్రపంచ ఆరోగ్య సంస్థ.. గ్లోబల్‌ ఎమర్జెన్సీ ప్రకటించింది. ఇంతకు ముందెన్నడూ లేని విధంగా ఈ వైరస్‌ విస్తరిస్తోందని ఆందోళన వ్యక్తం చేసింది. మరోవైపు చైనాను వణికిస్తోన్న మహమ్మారి భారత్‌లో కూడా అడుగుపెట్టింది. కేరళలో మొదటి కేసు నమోదు కావడంతో… అన్ని రాష్ట్ర ప్రభుత్వాలు అప్రమత్తమయ్యాయి.