పతాంజలి.. మేం చెప్పే వరకూ కరోనా మందుకు ప్రచారం చేయొద్దు

  • Published By: Subhan ,Published On : June 23, 2020 / 03:56 PM IST
పతాంజలి.. మేం చెప్పే వరకూ కరోనా మందుకు ప్రచారం చేయొద్దు

Updated On : June 23, 2020 / 3:56 PM IST

కేంద్రం పతాంజలిని కొవిడ్-19 గురించి రామ్ దేవ్ బాబా మందు కనిపెట్టారని ప్రకటించారు. మంగళవారం ఉదయం మందు తమ వద్ద ఉందని కేవలం 7రోజుల్లోనే తగ్గిపోతుందని చెప్పిన కొద్ది గంటల తర్వాత కేంద్రం నుంచి నెగెటివ్ రెస్పాన్స్ వచ్చింది. ఆయుష్ మంత్రిత్వ శాఖ పతాంజలి ఆయుర్వేద లిమిటెడ్ ను మెడిసిన్ గురించి పూర్తి వివరాలు తమకు తెలియజేయాలని చెప్పింది. దాంతో రీసెర్చ్ నిర్వహించి Institutional Ethics Committee clearance ఇచ్చిన తర్వాత  CTRI registration ఫలితాన్ని విడుదల చేస్తామని తెలిపింది. 

అప్పుడే పతాంజలి ప్రమోషన్ చేసుకోవద్దని తాము రీసెర్చ్ చేయడానికి సమయం పడుతుందని చెప్పింది. ఉత్తరాఖాండ్ ప్రభుత్వానికి చెందిన రాష్ట్ర లైసెన్సింగ్ అథారిటీ లైసెన్స్ కాపీలు, ప్రొడక్ట్ అప్రూవల్ వివరాలు వెల్లడిస్తే కొవిడ్ 19 ట్రీట్ మెంట్ కోసం ఆయుర్వేదిక్ మెడిసిన్ సప్లై చేసుకోవచ్చని తెలిపింది. 

విషయాలపై అవగాహన పెంచేలా మీడియాలో ఆయుర్వేదిక్ మెడిసిన్ వార్తలు వస్తున్నాయి. పతాంజలి ఆయుర్వేదిక్ లిమిటెడ్ గురించి పూర్తి వివరాలు వెల్లడించాలని, మెడిసిన్ కాంపోజిషన్ మెడిసిన్ పై ఎక్కడ రీసెర్చ్ చేశారో వివరాలు చెప్పాలని అంటున్నారు. కొవిడ్ 19 ప్రొటోకాల్, శాంపుల్ సైజ్, ఇన్‌స్టిట్యూషనల్ ఎథిక్స్ కమిటీ క్లియరెన్స్, సీటీఆర్ఐ రిజిస్ట్రేషన్ ఫలితాలు బయటపెట్టాలని తెలిపింది. 

క్లినికల్ కేస్ స్టడీ మీద క్లినికల్ ట్రయల్ నిర్వహించాం. మూడు రోజుల్లో 69శాతం పేషెంట్లు కోలుకున్నారు. 100శాతం పేషెంట్లు 7రోజుల్లోగా కోలుకున్నారు’ అని రామ్ దేవ్ బాబా అన్నారు. జైపూర్ లోని నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్స్ లో రీసెర్చ్ నిర్వహించామని రామ్ దేవ్ బాబా అన్నారు.