Viral Video : రన్నింగ్ బైక్ పై ముద్దులు .. ప్రేమ కాదు పైత్యం అంటున్న జనాలు
అమ్మాయి అబ్బాయి బైక్ మీద రయ్ మని దూసుకుపోతు ముద్దుల్లో మునిగిపోయారు. హెల్మెట్ వద్దు ముద్దులే ముద్దు అన్నట్లుగా రన్నింగ్ బైక్ పై ముద్దుల్లో మునిగిపోయారు.

Couples kissing on running bike
Couples kissing on running bike : పార్కులకు వెళదామంటే ఏ చెట్టు చాటు ఏ జంట ముద్దుల మోహాలు చూడాల్సి వస్తోందనే అనే భయంతో ఆ వైపే వెళ్లేందుకు సంకోచిస్తున్న పరిస్థితులు. పార్కులు,టూరిస్టు ప్లేసులు, సినిమా థియేటర్లు వంటి ప్రాంతాల్లో ఒకప్పుడు ముద్దులతో రెచ్చిపోయే జంటలు కనిపించేవారు. కానీ ఇప్పుడలా కాదు కొంతమంది మరీ రెచ్చిపోతున్నట్లుగా చూసేవారికి ఏవగింపు కలిగేలా నడిరోడ్డు అనీ లేదు..బస్టాపులన్నీ లేదు,ట్రాఫిక్ లోను ఇలా ఎక్కపడితే అక్కడ ముద్దులతో రెచ్చిపోతున్నారు.
ఇటీవల కాలంలో కొంత మంది పట్టపగలు నడిరోడ్డుపై బైక్ పై ముద్దులతో రెచ్చిపోతున్నారు. వాళ్లు ప్రేమికులా లేదా మరెవరు అనేది కూడా ప్రశ్నార్ధకమే. నిజమైన ప్రేమ ఉన్నవారు ఇలా రెచ్చిపోరు. ఇటువంటివారిని చూస్తుంటే ప్రేమకాదు పైత్యం అనిపించేలా ప్రవర్తిస్తున్నారు. పోలీసులు హెచ్చరించినా.. కేసు నమోదు చేసినా వారి తీరుమారటంలేదు.
Railway : ఒక్క ఎలుకను పట్టడానికి రూ.41,000 ఖర్చు చేసిన రైల్వే శాఖ .. ఎన్ని ఎలుకలు పట్టిందో తెలుసా..?
తాజాగా రాజస్థాన్ (Rajasthan)లోని జైపూర్ (Jaipur) లో నడిరోడ్డుపై బైక్ పై ఓ జంట రెచ్చిపోయారు. చుట్టుపక్కల వాహనదారులు చూస్తున్నారన్న జ్ఞానం కూడా లేకుండా రొమాన్స్ లో మునిగిపోయారు. బైక్ వెనుక నుంచి వస్తున్న మరో వాహనదారుడు ఈ తతంగాన్ని వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. ఈ ఘటన రాజస్థాన్ లో చోటు చేసుకుంది. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది.
రాజస్థాన్ జైపూర్ లోరోడ్డు మీద బైక్ పై వెళుతు ముద్దు పెట్టుకున్నారు. బైక్ నడిపే యువకుడు వెనుక కూర్చున్న యువతిని ముద్దు పెట్టుకున్నాడు. బైక్ పై ఆ జంట పరస్పరం ముద్దుల వర్షం కురిపించుకుంటూ వెళ్లారు. ఆ యువకుడు బైక్ ని రోడ్డుపై అలాగే రైడ్ చేస్తు వెళ్లాడు. ఇద్దరు హెల్మెట్లు పెట్టుకోలేదు. బహుశా హెల్మెట్ పెట్టుకుంటే ముద్దులు పెట్టుకోవటానికి అడ్డుగా ఉంటుందనేమో. ఇటువంటి చర్యలు వారికే కాదు తోటి వాహనదారులకు కూడా ఇబ్బందే. పైగా యాక్సిడెంట్లు అయ్యే అవకాశాలు చాలా ఎక్కువ.
జంట బైక్ పై రొమాన్స్ చేస్తూ వెళ్లిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ కావడంతో పోలీసుల దృష్టికి వెళ్లింది. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు రంగంలోకి దిగి బైక్ రిజిస్ట్రేషన్ నెంబర్ ఆధారంగా ఆ యువకుడిని అరెస్ట్ చేశారు. మోటార్ వెహికిల్స్ చట్టం ప్రకారం ఆ యువకుడిపై చర్యలు తీసుకుంటామని పోలీసులు తెలిపారు..
kitne ka chalan hona chaiye?@jaipur_police pic.twitter.com/HVq0Ufiq9Z
— rajni singh (@imrajni_singh) September 15, 2023